విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ
తన మాటలతోనో.. చేతలతోనో తెలియదు కాని హీరో విశాల్ రోజు రోజుకూ టార్గెట్ అవుతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకు వ్యతిరేకంగా ఓ వర్గం ఏర్పడేలా చేసుకున్నారు.
తన మాటలతోనో.. చేతలతోనో తెలియదు కాని హీరో విశాల్ రోజు రోజుకూ టార్గెట్ అవుతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకు వ్యతిరేకంగా ఓ వర్గం ఏర్పడేలా చేసుకున్నారు. కోలీవుడ్ పోలీటిక్స్ లో తనదైన ముద్ర వేసి ప్రస్తుతం నడిగరం సంఘం జనరల్ సెక్రటరీ గా కొనసాగుతున్నారు. కాని ఈ క్రమంలోనే ఈయన ఇంటిపై కొందరు కావాలనే రాళ్లు రువ్వడం తమిళనాడులో సంచలనంగా మారింది. ఒక్కసారిగా అందర్నీ విశాల్ వైపు చూసేలా చేసింది. ఇక చెన్నై లోని అన్నానగర్‌లో విశాల్ ఇంటిపైకి ఇద్దరు దుండగులు రాళ్లు విసిరారు. రెడ్ కలర్ కార్లో వచ్చిన వీరు.. ఒక్కసారిగా విశాల్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించి అక్కడి నుంచి జారుకున్నారు. అయితే విశాల్ ఆ టైంలో ఇంట్లో లేకపోవడంతో.. ఇంట్టో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Sep 29, 2022 09:45 AM
వైరల్ వీడియోలు
Latest Videos