Pawan Kalyan OG Movie: ఆకలితో ఉన్న చిరుత పవర్ స్టార్.. ‘ఓజీ’ టీజర్ అదిరిపోయింది..

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఓజీ ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు శుక్రవారం మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. శనివారం పవన్ బర్త్ డే సందర్భంగా ఉదయం 10.35 గంటలకు టీజర్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు.

Pawan Kalyan OG Movie: ఆకలితో ఉన్న చిరుత పవర్ స్టార్.. 'ఓజీ' టీజర్ అదిరిపోయింది..
Og Movie Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 02, 2023 | 10:45 AM

ఇటీవలే బ్రో సినిమాతో హిట్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ తోపాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు. ఈ సినిమా తర్వాత పవన్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఓజీ ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు శుక్రవారం మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. శనివారం పవన్ బర్త్ డే సందర్భంగా ఉదయం 10.35 గంటలకు టీజర్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ముందుగా చెప్పినట్లే తాజాగా ఓజీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఓజీ చిత్రయూనిట్.

ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్ లో షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఓజీలో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రలలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

‘Hungry Cheetah’ అంటూ ఓజీ వీడియో గ్లింప్స్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఆకలిమీదున్న చిరుత దాడి చేస్తే ఎలా ఉంటుందో చెబుతూ పవర్ స్టార్‏ను చూపించిన తీరు చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి ఓజీతో పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే