AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : పెద్ది షూటింగ్‏లో ప్రమాదం.. రామ్ చరణ్‏కు గాయాలు.. స్పందించిన పవన్ కళ్యాణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణల సమయంలో చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో పెద్ది చిత్రీకరణకు బ్రేక్ పడింది. చరణ్ కు చిన్న గాయమేనని.. దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

Ram Charan : పెద్ది షూటింగ్‏లో ప్రమాదం.. రామ్ చరణ్‏కు గాయాలు.. స్పందించిన పవన్ కళ్యాణ్..
Ram Charan, Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2026 | 3:56 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వ్సతున్న ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్, కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ పక్కా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నారు. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. మరోవైపు పెద్ది చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. చికిరి చికిరి, రైరై రారా పాటలకు నెట్టింట ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..

అయితే హైదరాబాద్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో చరణ్ కు చిన్నపాటి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన కంటి సమీపంలో స్వల్ప గాయమైందని తెలు్సతోంది. ఈ వార్త బయటకు రావడంతో అటు మెగా అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిత్రయూనిట్ స్పందిస్తూ.. ఇది కేవలం చిన్న గాయమేనని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు చరణ్ రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నారని.. అందుకే షూటింగ్ కు చిన్న బ్రేక్ వచ్చిందని.. చరణ్ మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

పెద్ది షూటింగ్ ప్రమాదం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “రాంచరణ్ త్వరగా కోలుకోవాలి. అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

Follow Us
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
నావల్ రవికాంత్ చెబుతున్న సంపద సృష్టి రహస్యాలివే!
బొద్దింకల బెడదతో విసిగిపోయారా? శాశ్వతంగా తరిమికొట్టే చిట్కాలు ఇవే
బొద్దింకల బెడదతో విసిగిపోయారా? శాశ్వతంగా తరిమికొట్టే చిట్కాలు ఇవే