AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ టిప్స్‌ ట్రై చేయండి..! హోటల్ స్టైల్ రుచి

బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, బెండకాయ వేపుడు లేదా పులుసు అంటే ఇష్టపడని వారుండరు. కానీ, బెండకాయ కూర అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆ జిగురు. బెండకాయలను కోసేటప్పుడు, వండేటప్పుడు వచ్చే ఆ జిగురు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ జిగురు వల్ల కూర రుచి మారడమే కాకుండా, ముక్కలు ఒకదానికొకటి అంటుకుని ముద్దగా అయిపోతాయి. ఇప్పుడు ఆ బాధ మీకు ఉండదు.. ఎందుకంటే.. ఇక్కడ కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే, మీ బెండకాయ వేపుడు పొడిపొడిగా, కరకరలాడుతూ వస్తుంది. అదేలాగో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Mar 25, 2026 | 3:03 PM

Share
తేమ లేకుండా చూసుకోండి: బెండకాయలను కడిగిన వెంటనే కోయకూడదు. కడిగిన తర్వాత ఒక పొడి గుడ్డతో తుడిచి, కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. నీటి చుక్కలు ఉంటే జిగురు మరింత ఎక్కువవుతుంది. ముక్కలు ఎంత చిన్నగా ఉంటే జిగురు అంత ఎక్కువగా బయటకు వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముక్కలను కొంచెం పెద్ద పరిమాణంలో కోయడానికి ప్రయత్నించండి.

1 / 5
నిమ్మరసం లేదా పెరుగు: వంట చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఆమ్చూర్ పొడి లేదా పెరుగు కలపండి. కూర వేగుతున్న సమయంలో ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా ఒక చెంచా పెరుగు కలపండి. వీటిలో ఉండే యాసిడ్ గుణం బెండకాయలోని జిగురును త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది.

2 / 5
ఉప్పు చివరలో వేయండి: చాలా మంది కూర వండటం మొదలుపెట్టినప్పుడే ఉప్పు వేస్తారు. కానీ బెండకాయ విషయంలో ఉప్పు వేస్తే అది తేమను విడుదల చేసి మరింత జిగురుగా మారుతుంది. అందుకే కూర దాదాపు 90శాతం ఉడికిన తర్వాతే ఉప్పు వేయాలి. బాణలి నిండా ముక్కలు వేసి ఉడికించకండి (Overcrowding). ముక్కల మధ్య గాలి ఆడేలా ఉంటే అవి ఆవిరి వల్ల మెత్తబడవు. తక్కువ పరిమాణంలో వేయించడం వల్ల ముక్కలు కరకరలాడుతాయి.

3 / 5
మూత పెట్టకండి: బెండకాయ కూర వండేటప్పుడు బాణలిపై మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరి నీరుగా మారి కూరలో పడుతుంది. దీనివల్ల ముక్కలు మెత్తబడి జిగురుగా తయారవుతాయి. కాబట్టి మూత తీసే ఉడికించాలి. బాణలిలో బెండకాయలు వేసిన తర్వాత మాటిమాటికీ గరిటెతో తిప్పకూడదు. ఎక్కువ కలిపితే ముక్కలు విరిగి లోపల ఉన్న విత్తనాలు, జిగురు బయటకు వస్తాయి.

4 / 5
ఆమ్చూర్ లేదా వినెగార్: మీరు పులుపు ఇష్టపడే వారైతే, వంట చివరలో కొంచెం ఆమ్చూర్ (మామిడికాయ పొడి) లేదా కొద్దిగా వినెగార్ కలిపితే జిగురు మాయమైపోతుంది. మసాలాలు కలపడానికి ముందే బెండకాయ ముక్కలను విడిగా కొంచెం నూనెలో 5 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవడం వల్ల కూడా జిగురు తగ్గుతుంది. ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మీ బెండకాయ వేపుడు హోటల్ స్టైల్‌లో పొడిపొడిగా, ఎంతో రుచిగా వస్తుంది.

5 / 5
Follow Us
క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి..

బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
బాటిళ్లల్లో పెట్రోల్ అమ్మకాలు బంద్..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..

బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి

శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు

మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..

గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?

90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!

ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 

డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే