Andhra Pradesh: ప్రతీ నెలా రూ.6 వేలు.. ఏపీలో కొత్తగా పెన్షన్ పొందాలనుకునేవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్
ఏపీలో పింఛన్ పొందాలనుకునేవారికి శుభవార్త. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్లు పొందేందుకు స్లాట్ల బుకింగ్‌ను ప్రభుత్వం మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో దివ్యాంగుల కోటా కింద ప్రతీ నెలా రూ.6 వేల పెన్షన్ అందుతుంది.

ఏపీలో కొత్తగా సామాజిక పింఛన్లు పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందాలనుకునేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. సదరం స్లాట్ల బుకింగ్స్‌ను ప్రారంభించింది. నేటి నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. సమీపంలోని గ్రామ, వార్డు సచివాయానికి వెళ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ నెల 30 నుంచి ఆస్పత్రుల్లో టెస్టులు
ఈ నెల 30వ తేదీ నుంచి స్లాట్స్ బుకింగ్ చేసుకున్నవారికి ఆస్పత్రుల్లో టెస్టులు నిర్వహిస్తారు. వైకల్యం నిర్ధారణ అయితే సదరం సర్టిఫికేట్ జారీ చేశారు. ఇంతకముందు మాన్యువల్ విధానంలో ఈ సర్టిఫికేట్ జారీ చేసేవారు. కానీ ఈ సారి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్ జారీ చేశారు. సదరం సర్టిఫికేట్ల స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ల జారీ విధానాన్ని డిజిటలైజ్ చేశారు. దీంతో ఇక నుంచి అన్నీ సేవలు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి.
స్లాట్ల బుకింగ్‌కు ఇవి అవసరం
స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో, వైకల్యం తెలిపే ఫొటోలు అవసరం. స్లాట్ బుక్ చేసుకోగానే ఆస్పత్రుల్లో టెస్టులకు డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ డేట్‌కి ఆస్పత్రికి వెళ్లి టెస్టులకు హాజరవ్వాలి. మీరు అర్హత సాధిస్తే.. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో సదరం సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దివ్యాంగుల కోటా కింద పింఛన్ పొందటానికి, ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇక ఏపీ ప్రభుత్వ ఇటీవల దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగ శక్తి పేరుతో అమలు చేస్తోంది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. దీంతో ఈ పథకం కింద లబ్ది పొందాలన్నా సదరం సర్టిఫికేట్ అనేది అవసరం. ఇక దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఇతర సబ్సిడీలు పొందాలన్నా ఈ సర్టఫికేట్ అవసరం. దీంతో సదరం సర్టిఫికేట్లకు ప్రాధాన్యత పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో సదరం సర్టిఫికేట్ల జారీలో అక్రమాలు జరిగాయనే కారణంతో సర్టిఫికేట్ల జారీని కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ సర్టిఫికేట్ల జారీని తిరిగి ప్రారంభించింది. దీంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాగులు దరఖాస్తు చేసుకుంటున్నారు.
