AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నుపుర్‌ పాటిల్ వెల్లడించిన ‘సింపుల్’ ఫిట్‌నెస్ మంత్రం ఇదే!

ముంబైకి చెందిన నుపుర్‌ పాటిల్ ఒకప్పుడు ఊబకాయంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. జిమ్‌లో కష్టపడినా ఫలితం రాకపోవడంతో, పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తన జీవనశైలిని మార్చుకున్నారు. అదే ఆమెను నేడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, క్రీడాకారులకు సలహాలిచ్చే స్థాయికి చేర్చింది.

సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నుపుర్‌ పాటిల్ వెల్లడించిన ‘సింపుల్’ ఫిట్‌నెస్ మంత్రం ఇదే!
Nupur Patil
Nikhil
|

Updated on: Mar 25, 2026 | 3:25 PM

Share

బరువు తగ్గడం అనేది ఒక నిరంతర పోరాటం అని చాలామంది భావిస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చడం, కఠినమైన డైట్ పాటించడం వంటివి చేస్తేనే బరువు తగ్గుతామని నమ్ముతారు. కానీ, ఎటువంటి ఖరీదైన జిమ్ మెంబర్‌షిప్‌లు లేకుండా, కేవలం క్రమశిక్షణ మరియు సరళమైన జీవనశైలి మార్పులతో ఏకంగా 30 కిలోల బరువు తగ్గానని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు నుపుర్‌ పాటిల్‌. ఒకప్పుడు పైలట్‌గా పనిచేసి, తన ఫిట్‌నెస్ ప్రయాణం తర్వాత న్యూట్రిషనిస్ట్‌గా మారిన ఆమె పంచుకున్న వెయిట్‌లాస్ సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నుపుర్‌ పాటిల్ పాటించిన 10 వెయిట్‌లాస్ సూత్రాలు..

1. నో ‘ఛీట్ మీల్స్’- బరువు తగ్గే క్రమంలో చాలామంది “ఈ ఒక్క పూటకే కదా” అని నచ్చిన జంక్ ఫుడ్ తింటారు. కానీ నుపుర్ తన లక్ష్యం చేరే వరకు ఎక్కడా రాజీ పడకుండా ఛీట్ మీల్స్‌కు దూరంగా ఉన్నారు. 2. ప్రోటీన్ రిచ్ డైట్- ఆమె తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. బోర్‌ కొట్టకుండా అవే పదార్థాలతో కొత్త రుచికరమైన రెసిపీలు తయారు చేసుకునేవారు. 3. నీటి మంత్రం- ఆకలిగా అనిపించినప్పుడల్లా ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగేవారు. దీనివల్ల కడుపు నిండుగా అనిపించి తక్కువ ఆహారం తీసుకునే వీలుంటుంది. 4. నడక, మెట్లు- భారీ వర్కవుట్లు కాకుండా మెట్లు ఎక్కడం, ఎక్కువ దూరం నడవడం వంటి చిన్నపాటి వ్యాయామాలనే నిత్యకృత్యంగా మార్చుకున్నారు. 5. నిద్ర, డిజిటల్ డిటాక్స్- త్వరగా పడుకోవడం, పడుకునే ముందు మొబైల్ చూడకపోవడం, అర్ధరాత్రి స్నాక్స్ తినే అలవాటును మానుకోవడం ఆమెకు బాగా ప్లస్ అయ్యింది. 6. ఇంటి భోజనమే శ్రేయస్కరం- బయటి ఫుడ్, ప్యాక్ చేసిన చిరుతిళ్లను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇచ్చారు. 7. సానుకూల దృక్పథం- బరువు తగ్గే క్రమంలో ప్రతికూల ఆలోచనలు రావడం సహజం, కానీ పట్టుదలతో సానుకూలంగా ముందుకు సాగడం ముఖ్యమని ఆమె నిరూపించారు. 8. పోలికలు వద్దు- ఇతరులతో పోటీ పడకుండా, తన శరీరతత్వానికి సరిపడే వ్యాయామాలనే ఆమె ఎంచుకున్నారు. 9. ఓపిక- బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే జరిగేది కాదు, ఓపికగా క్రమశిక్షణతో పద్ధతులను పునరావృతం చేయాలని ఆమె సూచిస్తున్నారు.

పైలట్ టు న్యూట్రిషనిస్ట్

తన స్వీయానుభవంతో బరువు తగ్గిన నుపుర్, ఆ తర్వాత న్యూట్రిషనిస్ట్ కోర్సు పూర్తి చేసి వృత్తిగా స్వీకరించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒలింపిక్ కమిటీ సైతం ఆమెను క్రీడా పోషకాహార నిపుణురాలిగా గుర్తించడం విశేషం. పీసీఓఎస్, మధుమేహం వంటి సమస్యలకూ ఆమె పోషకాహారం ద్వారా పరిష్కారాలు చూపుతున్నారు. “సింపుల్ డైట్.. స్థిరమైన జీవనశైలి” – ఇదే నుపుర్‌ సక్సెస్ మంత్రం. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఆమె తన ప్రయాణం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు.

Follow Us