అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో మంగళవారం దారుణ చైన్ స్నాచింగ్ జరిగింది. మంచూరు గ్రామంలో పొలంలో పనిచేస్తున్న చంద్రమ్మను చింతకాయలు కొంటానంటూ దుండగుడు నమ్మబలికాడు. ఆమె అజాగ్రత్తగా ఉన్న సమయంలో మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.