AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2026: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!

PSL 2026: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లీగ్‌ల సందడి మొదలైన వేళ పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే భారత లీగ్ నుంచి బెన్ డకెట్ తప్పుకోగా, తాజాగా మరో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జేమ్స్ విన్స్ పాకిస్థాన్ లీగ్ నుండి అర్ధాంతరంగా వైదొలిగారు. టోర్నీ ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

PSL 2026: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
Psl 2026
Venkata Chari
|

Updated on: Mar 25, 2026 | 3:49 PM

Share

PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ తొమ్మిదవ సీజన్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలకు కష్టాలు మొదలయ్యాయి. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన అనుభవజ్ఞుడైన బ్యాటర్ జేమ్స్ విన్స్ ఈ ఏడాది టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ముల్తాన్ సుల్తాన్స్ యాజమాన్యం పంచుకున్న తాజా జాబితా ప్రకారం, విన్స్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతంలో యూకేలోని తన నివాసంపై జరిగిన దాడుల కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన దుబాయ్‌కు మారిన సంగతి తెలిసిందే.

యుద్ధ వాతావరణమే కారణమా?

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్ మరియు ఇతర దేశాల మధ్య జరుగుతున్న పోరాటం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్‌లో చిక్కుకుపోయిన విన్స్, ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్ వెళ్లడానికి విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, ఆటగాళ్లలో నెలకొన్న భయాందోళనలు ఈ నిర్ణయానికి దారితీశాయి. విన్స్ తిరిగి తన స్వదేశానికి వెళ్తారా లేదా దుబాయ్‌లోనే ఉంటారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

భారీ ధరకు అమ్ముడైన ప్లేయర్..

ఈ సీజన్ వేలంలో జేమ్స్ విన్స్‌ను పెషావర్ జల్మీ ఫ్రాంచైజీ మూడు కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకుంది. పిఎస్ఎల్ చరిత్రలో విన్స్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 56 మ్యాచ్‌ల్లో 1544 పరుగులు చేసిన ఆయన, గత సీజన్‌లో కరాచీ కింగ్స్ తరపున మెరుగైన ప్రదర్శన కౌనబరిచారు. అగ్రశ్రేణి ఆటగాడు తప్పుకోవడంతో పెషావర్ జట్టు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకులాట ప్రారంభించింది.

ఐపీఎల్ నుంచి బెన్ డకెట్ నిష్క్రమణ..

మరోవైపు, భారత లీగ్ (ఐపీఎల్ 2026)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా చుక్కెదురైంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ డకెట్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుండి తప్పుకున్నారు. దేశం తరపున ఆడటమే తన ప్రాధాన్యత అని, శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. రెండు కోట్ల రూపాయల ఒప్పందాన్ని వదులుకుని డకెట్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ లోకంలో సంచలనంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌