AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ira Aery : అందంలో హీరోయిన్లకు పోటీ.. వికెట్లు తీయడంలో దిట్ట.. ఎవరీ లవ్లీ క్రికెటర్ ఇరా ఏరీ?

Ira Aery : ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో మెరిసిపోతున్న భారత సంతతి క్రికెటర్ ఇరా ఏరీ తన అద్భుత బౌలింగ్‌తో సంచలనం సృష్టిస్తోంది. ట్రై సిరీస్‌లో 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ క్రికెటర్ త్వరలోనే ఆస్ట్రేలియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.

Ira Aery : అందంలో హీరోయిన్లకు పోటీ.. వికెట్లు తీయడంలో దిట్ట.. ఎవరీ లవ్లీ క్రికెటర్ ఇరా ఏరీ?
Ira (1)
Rakesh
|

Updated on: Jun 16, 2026 | 11:03 AM

Share

Ira Aery : ప్రస్తుత రోజుల్లో మహిళా క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఆటతో పాటు తమ గ్లామర్‌తో స్టేడియంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే ముద్దుగుమ్మలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఆస్ట్రేలియా జూనియర్ క్రికెట్ నుంచి ఒక అద్భుతమైన బ్యూటీ వచ్చి చేరింది. ఆస్ట్రేలియా అండర్-19 మహిళా జట్టుకు ఆడుతున్న భారత సంతతి టీనేజ్ క్రికెటర్ ఇరా ఏరీ తన అందం, అసాధారణమైన బౌలింగ్ నైపుణ్యంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో అత్యంత అందమైన సంచలనంగా అవతరించింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా వెస్ట్రన్ రీజియన్ జూనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇరా ఏరీ.. అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టులో చోటు సంపాదించింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తనలో అంతకు మించిన క్రికెట్ టాలెంట్ ఉందని ఈ మెగా టోర్నీలో నిరూపించింది. ఈ ట్రై సిరీస్ మొత్తం మీద ఇరా ఏరీ అత్యంత కన్సిస్టెన్సీతో బౌలింగ్ చేసి.. కేవలం 9 సగటుతో ఏకంగా 13 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లోనే జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఈమె స్పెల్స్ చూసి అపోనెంట్ టీమ్స్ బ్యాటర్లు క్రీజులోకి రావడానికే భయపడ్డారు.

ఆ టోర్నమెంట్‌లో ఇరా ఏరీ కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. ఇంగ్లండ్ బ్యాటర్లకు తన స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపిస్తూ.. 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా మ్యాచ్‌ను మలుపు తిప్పే ఒక అద్భుతమైన రన్-అవుట్ కూడా చేసి ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. ఈ ఆల్ రౌండ్ షోకు గాను ఈ మోస్ట్ బ్యూటీఫుల్ క్రికెటర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ప్రెజెంటేషన్ సెరిమనీలో ఈమె అవార్డు తీసుకుంటున్న విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లోనూ ఇరా ఏరీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించింది. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసి 99 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్ జట్టు 96 పరుగులకే కుప్పకూలడంతో శ్రీలంక ఈ టోర్నీని క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఏకైక పాజిటివ్ పాయింట్ ఇరా ఏరీ మాత్రమే అని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతీయ సెలెక్టర్లు ఈ భారత సంతతి ముద్దుగుమ్మ ఆటను, ఆమె లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే ఆస్ట్రేలియా మెయిన్ ఉమెన్స్ టీమ్‌లోకి ఈ గ్లామరస్ బ్యూటీ అడుగుపెట్టడం ఖాయమని క్రీడా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

Follow Us