AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా..?

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ తాహేర్ అలీ రూ.70 వేల అప్పు తీసుకుని ఇప్పటివరకు రూ.1.33 లక్షలు చెల్లించినప్పటికీ, ఇంకా అసలు బాకీ ఉందంటూ ముగ్గురు నిందితులు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఆటోను బలవంతంగా తీసుకెళ్లడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా..?
Money
Naresh Gollana
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 12:27 PM

Share

అధిక వడ్డీ పేరుతో బాధితుడిని వేధిస్తూ, అతని ఆటోను బలవంతంగా అపహరించిన ముగ్గురు నిందితులను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌ కాలనీకి చెందిన తాహేర్ అలీ అనే ఆటో డ్రైవర్ తన అవసరాల నిమిత్తం పిట్టలవాడకు చెందిన పండిగొట్టి కొండయ్య అతని భార్య పండిగొట్టి లక్ష్మి వద్ద రూ.70,000 లను 10% వడ్డీతో అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న అనంతరం నెలవారీ వడ్డీ చెల్లిస్తూ ఇప్పటివరకు సుమారు రూ.1,33,000 చెల్లించాడు. అయితే ఇంకా అప్పు తీరలేదని అసలు ఇంకా అలాగే ఉందని వెంటనే చెల్లించాలంటూ బాదితుడిని వేధింపులకు గురి చేశారు.

అక్కడితో ఆగకుండా బాదితుడి ఉపాధిపై దెబ్బ కొట్టేలా అతని ఆటోను ఇంటి నుండి బలవంతంగా లాక్కెల్లారు‌. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు తన గోడును పోలీసులకు వెళ్లబోసుకున్నాడు‌. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అరెస్ట్ అయిన నిందితులు A1 పండిగొట్టి కొండయ్య, A2 పండిగొట్టి లక్ష్మి , A3 సిండే మురళి @ మాధవ్, పిట్టలవాడ, ఆదిలాబాద్ కు చెందిన వారిగా తెలిపారు పోలీసులు. అనుమతి లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా
అరేయ్ ఏంట్రా ఈ అరాచకం.. రూ.70 వేల అప్పుకు ఎంత వసూలు చేశారో తెలుసా
టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్‌.. NTA రియాక్షన్ ఇదే
టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్‌.. NTA రియాక్షన్ ఇదే
NEET హాల్ టికెట్ ఉంటే చాలు.. APSRTC బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు!
NEET హాల్ టికెట్ ఉంటే చాలు.. APSRTC బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు!
దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం!
దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం!
తల్లికి వందనం అర్హత చెక్ చేసుకోవడం ఎలా? జస్ట్ ఆధార్ నెంబర్‌తో..
తల్లికి వందనం అర్హత చెక్ చేసుకోవడం ఎలా? జస్ట్ ఆధార్ నెంబర్‌తో..
మహిళలకు అదిరిపోయే న్యూస్..ఈపాత్రల్లో వంటచేస్తే చిటికెలో అయిపోద్ది
మహిళలకు అదిరిపోయే న్యూస్..ఈపాత్రల్లో వంటచేస్తే చిటికెలో అయిపోద్ది
ఫిఫా వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించిన కిరాణా షాప్ ఓనర్ కొడుకు
ఫిఫా వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించిన కిరాణా షాప్ ఓనర్ కొడుకు
నీరు, ఆహారంతో వ్యాపిస్తున్న ప్రమాదకర ఇన్ఫెక్షన్..!
నీరు, ఆహారంతో వ్యాపిస్తున్న ప్రమాదకర ఇన్ఫెక్షన్..!
స్టార్ హీరో నా భుజం మీద చెయ్యేసి ఆ మాట అన్నాడు
స్టార్ హీరో నా భుజం మీద చెయ్యేసి ఆ మాట అన్నాడు
ప్రసాదానికి మించిన టేస్ట్.. తమిళనాడు స్టైల్ సెక్కరై పొంగల్ తయారీ
ప్రసాదానికి మించిన టేస్ట్.. తమిళనాడు స్టైల్ సెక్కరై పొంగల్ తయారీ