AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో నా భుజం మీద చెయ్యేసి ఆ మాట అన్నాడు.. నేను షాక్ అయ్యా..! మిర్చి మాధవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మిర్చి మాధవి తన కెరీర్, అలాగే ఓ స్టార్ హీరో అనుభవాలు, అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటి సవాళ్లపై మాట్లాడారు. ఓ స్టార్ హీరో తన పులిహోరను మెచ్చుకున్న సందర్భాన్ని, అలాగే ఆ స్టార్ హీరో షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో నిజాయితీగా రాణించడంపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

స్టార్ హీరో నా భుజం మీద చెయ్యేసి ఆ మాట అన్నాడు.. నేను షాక్ అయ్యా..! మిర్చి మాధవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mirchi Madhavi
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 11:55 AM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి మిర్చి మాధవి గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని అనేక ఆసక్తికర విషయాలను, అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. తాను సులభంగా బాధపడనని, అలా బాధపెట్టిన వారిని బతకనివ్వనని తన వ్యక్తిత్వాన్ని తెలియజేశారు. తనకెప్పుడూ శత్రువులు ఉండరని, ఎందుకంటే తాను తనని ప్రేమించడం తప్ప ద్వేషించే అవకాశం ఎవరికీ ఇవ్వనని ఆమె అన్నారు. సలహాలు అడిగితేనే చెబుతానని, పబ్లిసిటీ కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ, సినిమా బడ్జెట్‌ను బట్టి, తన పాకెట్ నిండేంత తీసుకుంటానని చెప్పారు. దాదాపు మూడు లక్షల రూపాయల చెక్కులు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఆ హీరోయిన్ ఈమేనా.!! ఎంత మారిపోయింది.. సంతోషం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే

అల్లు అర్జున్‌తో తన అనుభవాలను పంచుకుంటూ, డీజే సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. తాను ఇంట్లో తయారుచేసి తీసుకెళ్లిన పులిహోరను అల్లు అర్జున్ చాలా ఇష్టంగా తిని, ఆమెను పిలిచి “పులిహోర చాలా బాగా చేశారండీ. ఎలా చేశారు?” అని అడిగారని తెలిపారు. ఒకరోజు షూటింగ్ లో నన్ను అల్లు అర్జున్ పిలిచారు. నేను వెళ్లగానే నా భుజంపై చెయ్యివేసి పులిహోర చాలా బాగా చేశారండీ అన్నడు. అది విని నేను షాక్ అయ్యిపోయా.. అల్లు అర్జున్ అంత సింపుల్‌గా ఉంటారని, సెట్‌లోకి రాగానే మొబైల్ చూసుకోకుండా అందరినీ చూస్తూ నవ్వుతారని, ఆ నవ్వు ఎప్పుడూ చెక్కుచెదరదని ఆయన మంచి క్వాలిటీని కొనియాడారు. అల్లు అర్జున్‌తో తాను జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే, పరుగు వంటి ఐదు చిత్రాలలో నటించినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే

మిర్చి సినిమాతో తనకు మిర్చి మాధవి అనే పేరు వచ్చిందని చెబుతూ, ప్రభాస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. డార్లింగ్ సినిమా షూటింగ్ సమయంలో 21 రోజులు ప్రభాస్‌ను చూడటానికే షూటింగ్‌కు వెళ్లేదాన్నని ఆమె అన్నారు. ప్రభాస్ చాలా సైలెంట్‌గా, ఎవరితోనూ మాట్లాడకుండా, ఎక్కడో కూర్చొని ఉంటాడు. అప్పట్లో డైట్ ఫుడ్ గురించి తనకు తెలియదని, ప్రభాస్ తాగే గ్రీన్ టీని తాను తాగడానికి ప్రయత్నించి వాంతి చేసుకున్నట్లు సరదాగా చెప్పారు. కాజల్‌ను ఆటపట్టించేవారని, “నీకు కలర్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు” అని చెప్పేవారని పేర్కొన్నారు. ప్రభాస్ తన మేనేజర్‌తో, “ఆంటీ కళ్ళు బాగున్నాయి” అని అన్నారని మాధవి తెలిపారు. ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలవడం ఆయన ఊతపదమని, అందుకే అందరూ ఆయన్ను డార్లింగ్ ప్రభాస్ అని పిలుస్తారని మాధవి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. 200లకు పైగా సినిమాలు.. చివరకు..
ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. 200లకు పైగా సినిమాలు.. చివరకు..
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శిఖర్ ధావన్
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు..
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు..
రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై..
రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై..
అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్
అక్టోబర్‌, నవంబర్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. షెడ్యూల్
టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు
టీమిండియాకు ఫుల్ బిజీ షెడ్యూల్.. 27 రోజుల్లో 2 దేశాలు, 10 టీ20లు
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్..
సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..
సీతాఫలానికి కష్టకాలం.. ఎల్‌నినో దెబ్బకు తగ్గిన దిగుబడి..
దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..
దుర్గాపూజలో ‘ది జంగిల్ బుక్’ థీమ్.. అమ్మవారి మండపం చూస్తే..
కాణిపాకం వినాయకుడి 21 కేజీల లడ్డూకు భారీ ధర..
కాణిపాకం వినాయకుడి 21 కేజీల లడ్డూకు భారీ ధర..