AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కఫ్ సిరప్‌ల (దగ్గు మందు) అమ్మకాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఎంతటి చిన్న పల్లెటూరైనా సరే.. సరైన డ్రగ్ లైసెన్స్ లేని దుకాణాల్లో కఫ్ సిరప్‌లను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!
Cough Syrup
Balaraju Goud
|

Updated on: Jun 16, 2026 | 12:07 PM

Share

దేశంలో నకిలీ, ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో కఫ్ సిరప్‌ల (దగ్గు మందు) అమ్మకాలపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఎంతటి చిన్న పల్లెటూరైనా సరే.. సరైన డ్రగ్ లైసెన్స్ లేని దుకాణాల్లో కఫ్ సిరప్‌లను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనలపై TV9 కథనం…

గ్రామీణ ప్రాంతాల్లో దగ్గు మందుల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ రూల్స్, 1945 కింద కీలక సవరణలు చేపట్టింది. ఇందుకోసం కేంద్రం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పాత నిబంధనల ప్రకారం.. 1,000 కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో రిటైల్ లైసెన్స్ లేకపోయినా కొన్ని షరతులతో దగ్గు సిరప్‌లను అమ్మడానికి వీలుండేది. కానీ, తాజా సవరణతో ఆ మినహాయింపులకు కేంద్రం పూర్తిగా చెక్ పెట్టింది.

కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుల ప్రకారం.. చిన్న గ్రామాల్లోనైనా సరే కఫ్ సిరప్‌ల అమ్మకం, పంపిణీ ఇకపై కేవలం అధికారికంగా లైసెన్స్ పొందిన ఫార్మసీల (మెడికల్ షాపుల) ద్వారా మాత్రమే జరగాలి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 నిబంధనలను ఇందుకు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నకిలీ మందుల సరఫరాను అడ్డుకోవడంతో పాటు, కఫ్ సిరప్‌ల విక్రయాల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

దగ్గు మందుల బాధ్యతాయుతమైన విక్రయాలను ప్రోత్సహించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒకవేళ ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా విక్రయాల రికార్డుల్లో పారదర్శకత లోపించినా సంబంధిత డ్రగ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని కేంద్రం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కఫ్ సిరప్ తయారీదారులు, హోల్‌సేల్ పంపిణీదారులు, రిటైల్ వ్యాపారులు ఈ కొత్త లీగల్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి పనిచేయాలని స్పష్టం చేసింది.

చిన్న పల్లెల్లో సైతం నాణ్యమైన వైద్య ప్రమాణాలు అందించేందుకు, నకిలీ మందుల ముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us