AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డు ఈఎంఐ మాయాజాలం.. కనిపించని ఈ ఛార్జీల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డ్ వాడకం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఈజీ EMI లేదా నో కాస్ట్ EMI అనే ప్రకటనలు వినియోగదారులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అయితే పైన కనిపిస్తున్నంత సులభంగా ఈ EMIలు ఉండవని, వీటి వెనుక భారీగా దాగి ఉన్న ఛార్జీలు ఉంటాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Mar 25, 2026 | 3:21 PM

Share
EMI అంటే వాయిదా కాదు: చాలామంది ఈఎంఐని కేవలం వస్తువు ధరను విడతలుగా చెల్లించడం అని భావిస్తారు. కానీ వాస్తవానికి మీరు ఒక వస్తువును ఈఎంఐగా మార్చిన మరుక్షణమే అది వ్యక్తిగత రుణం కిందకు వస్తుంది. అంటే సదరు ఆర్థిక సంస్థ మీకు ఆ మొత్తం అప్పుగా ఇచ్చిందని అర్థం. దీనిపై వార్షిక వడ్డీ రేటు 12శాతం నుండి 24శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

1 / 5
ఉదాహరణకు రూ. 80,000 విలువైన వాషింగ్ మెషీన్‌ను 12 నెలల వాయిదాలలో నెలకు రూ. 7,900 చొప్పున కొనాలనుకుంటున్నారు. పైకి ఇది తక్కువ మొత్తంగా అనిపించినా ఏడాది చివరకు మీరు చెల్లించే మొత్తం అదనపు ఛార్జీలతో కలిపి దాదాపు రూ.1 లక్షకు చేరువయ్యే ప్రమాదం ఉంది.

2 / 5
క్రెడిట్ కార్డ్ EMIని ఎంచుకున్నప్పుడు కేవలం వడ్డీయే కాకుండా కొన్ని ఛార్జీలు కూడా తోడవుతాయి. కొనుగోలు మొత్తంలో 1శాతం నుండి 3శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులపై 18శాతం GST వర్తిస్తుంది. నేరుగా చెల్లింపులు చేస్తే వచ్చే క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు EMI లావాదేవీలకు వర్తించవు. ఒకవేళ మీరు గడువు కంటే ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించాలనుకుంటే, బకాయిపై 1శాతం నుండి 5శాతం వరకు పెనాల్టీ విధిస్తారు.

3 / 5
నో కాస్ట్ - ఒక మాయాజాలం: వడ్డీ లేని ఈఎంఐ అనేది ఒక వ్యాపార తంత్రం మాత్రమే. సాధారణంగా దుకాణదారులు వస్తువుపై ఇచ్చే డిస్కౌంట్‌ను తగ్గించి, ఆ మొత్తాన్ని వడ్డీ రూపంలో బ్యాంకుకు సర్దుబాటు చేస్తారు. అంటే మీరు ఒకేసారి నగదు చెల్లిస్తే వచ్చే డిస్కౌంట్ ధరను EMI ఎంచుకోవడం ద్వారా కోల్పోతున్నారు.

4 / 5
వినియోగదారులు ఏం చేయాలి?: వస్తువును కొనుగోలు చేసే ముందు నగదు ధరకు, EMI మొత్తం ధరకు మధ్య ఉన్న తేడాను లెక్కించుకోవాలి. అనవసరమైన ప్రాసెసింగ్ ఫీజులు, GST భారం పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా సామీ.. కోటికిపైగా బెడ్‌షీట్లు

ఎడారిలో పండే పంట మన తెలంగాణలో..కోట్లలో లాభం

తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం..

చిన్న మొత్తంతో కోటీశ్వరులను చేసే SIP ఫార్ములా ఇది..

సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్

పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..

రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్

మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు