AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. విస్తుపోయే నిజాలు.. హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్‌

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు బయటకు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉగ్ర లింకు కేసులో హైదరాబాద్‌లో ఒకరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. విజయవాడలో తెల్లవారుజామున కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల తర్వాత..

Vijayawada: విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. విస్తుపోయే నిజాలు.. హైదరాబాద్‌లో ఒకరి అరెస్ట్‌
Vijayawada Terror Links Case
Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 8:17 AM

Share

Vijayawada: విజయవాడ నగరం ఒక్కసారిగా ఉగ్ర భయంతో వణికిపోయింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వించిపేట ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) అధికారులు నిర్వహించిన మెరుపు దాడులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఈ నేపత్యంలో విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. 2025 జూన్‌లో ముగ్గురిని గుజరాత్ ATS అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి పోలీసులకు అనుమానం రాకుండా.. జాగ్రత్తపడింది 12 మంది సభ్యుల గ్యాంగ్. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో.. సంస్థను ఏర్పాటు చేశారు సొహైల్ బేగ్, షరీఫ్, డానిష్. ఇన్‌స్టా గ్రూప్‌లో 12 మంది ఉన్నట్టు గుర్తించారు.

వెస్ట్ బెంగాల్‌, రాజస్థాన్‌, కర్నాటక, బిహార్‌.. మహారాష్ట్ర,ఢిల్లీలో కార్యకలాపాలకు ఈ గ్యాంగ్ సిద్ధమైనట్లు గుర్తించారు. బిహార్ వాసి దిల్కాష్‌ సహా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా రెండు గ్రూప్‌లు నడుస్తున్నట్లు గుర్తించారు. IQIS, ISIS పేర్లతో గ్రూప్‌లు పెట్టారు నిందితులు. తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు విజయవాడకు చెందిన వారు, ఒకరు హైదరాబాద్‌కు చెందిన వారిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఐజీ త్రిపాఠి ప్రకటించారు.

ముగ్గురు నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడం, యువతను ఆకర్షించడమే వీరి అజెండాగా పోలీసులు తేల్చారు. రెండు గ్రూపుల్లో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సమాచారం సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఏటీఎస్‌కు సమాచారం అందించి వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు సిద్ధమయ్యాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ