AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. ఎప్పుడంటే..!

పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సొమ్ము అకౌంట్లో ఎప్పుడు పడుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు సాయం కోసం చూస్తున్నారు. మార్చిలో ప్రధాని మోదీ 22వ విడతను అందించారు.

PM Kisan: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. ఎప్పుడంటే..!
Pm Kisan 23rd Installment
Venkatrao Lella
|

Updated on: Jun 15, 2026 | 10:32 AM

Share

నైరుతి రుతువపనాలు విస్తరించడం, వర్షాలు మొదలైన క్రమంలో రైతులు పంట సాగుకు సిద్దమవుతున్నారు. పంటకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాలు అందించే సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్ధిక సాయం అందిస్తోండగా.. త్వరలో పొలం పనులు మొదలుకానుడటంతో 23వ విడత నిధుల కోసం ఆసక్తితో చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని నిరీక్షిస్తున్నారు. అయితే రైతుల నిరీక్షణకు తెరపడినట్లేనని చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న 23వ విడత నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. మోదీ ప్రభుత్వం అకౌంట్లో ఎప్పుడు వేయనుందనే విషయం క్లారిటీ వచ్చేసింది.

23వ విడత ఎప్పుడంటే..?

పీఎం కిసాన్ 22వ విడతను మార్చిలో ప్రధాని మోదీ విడుదల చేశారు. అయితే 23వ విడతను కూడా జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. 23వ విడతను జులై మధ్య వారంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఏడాదికి మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వీటిని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నిబంధన ప్రకారం చూసుకుంటే.. మార్చిలో 22వ విడత సొమ్మును అందించారు. అక్కడ నుంచి నాలుగు నెలల తర్వాత అంటే జూన్‌తో గడువు ముస్తుంది. దీంతో జులైలో 23వ విడత నగదును కేంద్రం పంపిణీ చేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. గత చరిత్రను పరిశీలిస్తే జులైలో అకౌంట్లో పడొచ్చని చెబుతున్నారు.

ఇవి చేయకపోతే డబ్బులు కట్

అయితే పీఎం కిసాన్ నిధులు అకౌంట్లో పడాలంటే ఈకేవైసీ నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అలాగే భూమి కేటాయింపు ధృవీకరణను నిర్వహించాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం, బ్యాంక్ కేవైసీ, బ్యాంక్‌తో ఎన్‌పీసీఐ అనుసంధానం వంటివి పూర్తి చేసి ఉండాలి. ఇవి పెండింగ్‌లో ఉంటే అకౌంట్లో డబ్బులు పడవు. వీటిని చేయని లబ్దిదారులు 23వ విడత పడేలోపు కంప్లీట్ చేయాలి. అప్పుడే అకౌంట్లలో డబ్బులు పడతాయి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి మీరు స్టేటస్ చేసుకోవచ్చు. మీ కేవైసీ పూర్తి అయిందా.. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ సీడింగ్ పూర్తయిందా లాంటి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. అనంతరం పెండింగ్‌లో ఉండే సరిచేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్ సాయంతో కూడా డీటైల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటి వద్ద నుంచే అన్నీ వివరాలు చెక్ చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది.

Follow Us