AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు సిద్ధార్థకు ఈత నేర్పించేందుకు వెళ్లిన తల్లి రేవతి, ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి కుమారుడితో పాటు ప్రాణాలు కోల్పోయింది. పంట పొలంలోని 10 అడుగుల లోతున్న తార్‌పాలిన్ ఫార్మ్ పండ్‌లో తాడు కట్టి ఈత నేర్పిస్తుండగా తాడు జారిపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.

అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
Mother Son Drown
Raju M P R
| Edited By: |

Updated on: Jun 15, 2026 | 8:53 AM

Share

చిత్తూరు జిల్లాలో కొడుకుకు ఈత నేర్పాలనుకున్న ఒక తల్లి ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. కొడుకు తోపాటు ఆ తల్లి ప్రాణాలు పోగొట్టుకునేందుకు కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో ఉపాధి హామీ ఫారం ఫండ్ నీటి కుంటలో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. నెలవాయి గ్రామానికి చెందిన తల్లి రేవతి, కొడుకు సిద్ధార్థ మృతి చెందారు. రఘుపతి నాయుడు పంట పొలంలోని 10 అడుగుల లోతుగల తార్ పాలిన్ ఫారం ఫండ్ లో ఆదివారం కొడుకు సిద్ధార్థ కు ఈత నేర్పించేందుకు తల్లి రేవతి తీసుకెళ్ళింది.

తాడు కట్టి ఈత నేర్పిస్తుండగా తాడు జారి పోయింది. దీంతో కొడుకుతో పాటు తల్లి కూడా నీటి కుంటలో పడి పోయింది. బయటకు రాలేక ఇద్దరూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కుంటలో నుంచి మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు .. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్ఆర్ పురం పోలీసులు డెడ్ బాడీలను పోస్టు మార్టం కోసం చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లి కొడుకు ఇద్దరూ నీటి కుంటలో పడి ప్రాణాలు పోగొట్టుకోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

ఈత కోసం వెళ్లి తల్లీ కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నడిపేవారు ఈ తప్పులు చేయకండి!
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. నీతి కథ
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
వాషింగ్ మెషీన్‌లోకి నీళ్లు స్లోగా వస్తున్నాయా.. పైసా ఖర్చు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
ఆపద్బాంధవులుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. అస్సాం వరదల్లో..
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు!
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? ఇవిగో పూర్తి వివరాలు..
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు
ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు