AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు పక్కన టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు! దొంగ డాక్టర్ గుట్టురట్టు

బాపట్ల జిల్లా పర్చూరులో అర్హతలు, అనుమతులు లేకుండా ఒక వ్యక్తి ఆసుపత్రి నడుపుతున్న ఘటన కలకలం రేపింది. గతంలో టీ దుకాణం నడిపిన ఇతడు, ఏడాదిగా కార్పొరేట్ తరహాలో బెడ్‌లు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ వైద్యంపై అధికారులు విచారణ ప్రారంభించారు.

రోడ్డు పక్కన టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు! దొంగ డాక్టర్ గుట్టురట్టు
Parchur Fake Doctor
SN Pasha
|

Updated on: Jun 15, 2026 | 9:09 AM

Share

బాపట్ల జిల్లా పర్చూరులో ఓ వ్యక్తి అనుమతులు, అర్హతలు లేకుండానే ఆసుపత్రి నిర్వహిస్తూ వైద్యం చేస్తున్నాడనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎన్నో సంవత్సరాలుగా హోటల్‌, టీ దుకాణం నిర్వహిస్తున్న ఈ వ్యక్తి గతంలో చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు మందులు తెచ్చి స్థానికులకు అందించేవాడని సమాచారం. అయితే ఏడాది క్రితం టీ దుకాణానికి సమీపంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ భవనంలో పడకలు, చికిత్సకు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున టీ దుకాణం వద్ద కనిపించే అతడు, అక్కడ వ్యాపారం ముగిశాక వైద్యుడిలా చికిత్స చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రిని తలపించే విధంగా బెడ్‌లు ఏర్పాటు చేసి రోగులను చేర్చుకుంటున్నాడన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైనా చికిత్స అందించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు నిజమైన వైద్యుడని నమ్మి చికిత్స పొందితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, వివరాలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విషయం జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ దృష్టికి చేరడంతో ఆమె వెంటనే స్పందించారు. స్థానిక వైద్యాధికారులతో కలిసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, సంబంధిత వ్యక్తికి వైద్య సేవలు అందించే అర్హతలు, అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.

విచారణలో అక్రమాలు వెలుగులోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పర్చూరులో నకిలీ వైద్యుల వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజలు వైద్య సేవలు పొందే ముందు సంబంధిత వైద్యుడి అర్హతలు, ఆసుపత్రి అనుమతులను నిర్ధారించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
సర్కార్ రైలులో బాపట్ల రైలు దొంగల ముఠా చోరీ.. 2 నెలల్లో 3 దోపిడీలు
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
దేశంలో ఈ చెల్లింపులన్నీ ట్యాక్స్ ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా కట్టకండి
ప్రధాని మోదీతో మీటింగ్.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన మాక్రాన్..
ప్రధాని మోదీతో మీటింగ్.. దురంధర్ సాంగ్ పోస్ట్ చేసిన మాక్రాన్..