AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: ఏటీఎంకు వెళుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్లోని డబ్బులు హాంఫట్.. సెకన్లలోనే ఊడ్చేస్తారు..

ఏటీఎం ద్వారా జరిగే మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతున్నా.. మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. కొత్త తరహా మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మీ అకౌంట్లోని డబ్బులు హాంపట్.

ATM: ఏటీఎంకు వెళుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్లోని డబ్బులు హాంఫట్.. సెకన్లలోనే ఊడ్చేస్తారు..
Using Deceased Person Atm Card Legal Or Illegal
Venkatrao Lella
|

Updated on: Jun 15, 2026 | 11:06 AM

Share

యూపీఐ రాకతో సెకన్లలోనే ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు నగదును ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీంతో స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. జస్ట్ క్యూఆర్ కోడ్, మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా సెకన్లలోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఎక్కువమంది వీటికి అలవాటుపడిపోగా.. చేతిలో నగదు ఉంచుకునేవారు తగ్గిపోయారు. కానీ ఇంటర్నెట్ లేనప్పుడు, సిగ్నల్స్ సరిగ్గా లేనప్పుడు, టెక్నికల్ ఇష్యూ వల్ల డిజిటల్ లావాదేవీలు చేయలేని పక్షంలో సమీపంలోని ఏటీఎంకు వెళ్లి నగదు విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇటీవల ఏటీఎం మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి.

నకిలీ కీప్యాడ్ల ద్వారా..

ముఖ్యంగా ఐదు రకాల మోసాలు ఏటీఎం ద్వారా జరుగుతున్నాయి. నకిలీ ఏటీఎం మెషీన్లు, కార్డ్ స్కిమ్మింగ్, నకిలీ కీప్యాడ్లు, లెబనీస్ లూప్, రహస్య కెమెరాలతో ఏటీఎం పిన్ తెలుసుకోవడం వంటి మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. లెబనీస్ లూప్ టెక్నిక్ ద్వారా కార్డ్ స్లాట్‌లో ఒక పల్చని ప్లాస్టిక్ పట్టీని పెడతారు. ఏటీఎంలో కార్డ్ పెట్టగానే ఇరుక్కుపోతుంది. ఏటీఎం పనిచేయడ లేదని కస్టమర్ భావిస్తాడు. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు మీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తున్నట్లు నటిస్తారు. కస్టమర్ వెళ్లగానే ఇరుక్కుపోయిన కార్డు ద్వారా డబ్బును కొల్లగొడతారు. దీంతో మీ కార్డు ఇరుక్కుపోతే వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడం లేదా బ్లాక్ చేయడం చేయండి.

రహస్య కెమెరాల ద్వారా..

ఇక ఏటీఎం కీప్యాడ్‌పై నకిలీ కీప్యాడ్‌లను అమర్చుతారు. కస్టమర్ ఏటీఎం పిన్‌ను ఎంటర్ చేసేటప్పుడు ఈ కీప్యాడ్ ద్వారా సమాచారం మొత్తం రికార్డవుతుంది. దీంతో పాటు ఏటీఎం మెషీన్ దగ్గర సీక్రెట్ కెమెరాలను అమర్చి పిన్ నెంబర్ తెలుసుకుంటారు. దీని ద్వారా మీ అకౌంట్లోని డబ్బును కాజేస్తారు. ఇలాంటి మోసం బారిన పడకుండా ఉండాలంటే మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చేతిలో కీప్యాడ్‌ను కప్పి ఉంచండి. సమీపంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే జాగ్రత్త పడండి. ఇక ఏటీఎం మెషీన్‌లో నకిలీ పరికరాలను అమర్చడం లేదా నకిలీ ఏటీఎంలను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తున్నారు. అందుకే నమ్మకమైన ప్రదేశాల్లో ఉండే బ్యాంక్ ఏటీఎంలు మాత్రమే ఉపయోగించుకోండి. నిర్మానుష్యం, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో ఉండే ఏటీఎంలను వాడకపోవడం సురక్షితం. ఇక ఏటీఎం కార్డ్ స్లాట్‌లో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చి వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి పట్ల కూడా జాగ్రత్త అవసరం.

Follow Us