AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇదెక్కడి అభిమానం సామీ.. స్టార్ హీరోకు గుడి కట్టిన వీరాభిమాని.. ఫోటోస్ వైరల్..

సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు. తమకు ఇష్టమైన సెలబ్రెటీ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఇదివరకే చాలా మంది హీరోయిన్లకు తమ ఫ్యాన్స్ గుడి కట్టేశారు. ఖుష్బూ మొదలుకుని.. సమంత, నిధి అగర్వాల్, కాజల్ ఇలా పలువురు తారలకు గుడి కట్టి అభిమానిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని తనకు ఇష్టమైన హీరో కోసం టెంపుల్ నిర్మించారు.

Tollywood : ఇదెక్కడి అభిమానం సామీ.. స్టార్ హీరోకు గుడి కట్టిన వీరాభిమాని.. ఫోటోస్ వైరల్..
Sudeep
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2026 | 1:06 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో సుదీప్ ఒకరు. హీరోగానే కాకుండా కథ డిమాండ్ చేస్తే విలన్ పాత్రలు సైతం పోషిస్తూ సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. కన్నడలో సూపర్ స్టార్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో.. తెలుగులో మాత్రం ఈగ సినిమాతో విలన్ పాత్రతో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సుదీప్ కు.. ఓ అభిమాని ఏకంగా గుడి కట్టించారు. అంతేకాకుండా ప్రతి రోజూ సుదీప్ కు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న దొడ్డగజనూరు గ్రామంలో సుదీప్ గుడి నిర్మించాడు ఓ అభిమాని. జీవనోపాధి కోసం ఐస్ క్యాండీలు అమ్ముకునే రోజువారీ కూలీ అయిన సిద్దరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

ఈ గుడిలో సుదీప్ విగ్రహం ప్రతిష్టించి.. ప్రతీ రోజు పూజ చేస్తున్నాడు సిద్ధరాజు. ఈ గుడిలో సుదీప్ విగ్రహంతోపాటు మహర్షి వాల్మీకి, మడకరి నాయక వంటి సాంస్కృతిక, చారిత్రక ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి. సుదీప్ పట్ల సిద్దరాజుకు ఉన్న అభిమానం ఈ ఒక్క చర్యతోనే ఆగలేదు. ఆయన ఆ నటుడి ప్రతి సినిమా విడుదలను మొదటి రోజే చూస్తారట. సుదీప్ పై అభిమానంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు తన కుటుంబం తనకు అండగా నిలిచిందని తెలిపాడు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

సుదీప్ విషయానికి వస్తే.. కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్.. తెలుగు, హిందీ, కన్నడ భాషలలో కలిపి మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు. ఈగ సినిమా తర్వాత సుదీప్ నటించిన కన్నడ సినిమాలను తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. అందుకే తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..

Sudeep Temple

Sudeep Temple

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us