Pawan Kalyan: తొలి ప్రేమ సినిమా రెమ్యునరేషన్‏తో పవన్ ఏం చేశాడో తెలుసా..? ఎంత లక్షలు తీసుకున్నాడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ మలుపు తిప్పిన చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం యూత్‏కు తెగ నచ్చేశాయి. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు పవన్.

Pawan Kalyan: తొలి ప్రేమ సినిమా రెమ్యునరేషన్‏తో పవన్ ఏం చేశాడో తెలుసా..? ఎంత లక్షలు తీసుకున్నాడంటే..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 03, 2025 | 4:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటివరకు పవన్ నటిస్తోన్న చిత్రాల షూటింగ్స్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. డిప్యూటీ సీఎంగా ప్రతిక్షణం ప్రజల సేవలో బిజీగా ఉన్నారు పవన్. అలాగే తనకు వీలు కుదురినప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. దీంతో వీలైనంతవరకు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితమే పవన్ హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణలో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు డేట్స్ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. తన సినిమాలు, పుస్తక పఠన అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. తనకు పుస్తక పఠన అంటే ఎంతో ఇష్టమని.. అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాడ్నో అంటూ చెప్పుకొచ్చారు. తన వదినమ్మను డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాడినని చెప్పుకొచ్చారు. ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని.. తాను కోరుకునే చదువు పాఠ్య పుస్తకాలలో లేదని అన్నారు. ఇక తొలి ప్రేమ సినిమాకు తనకు పదిహేను లక్షల పారితోషికం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

పదిహేను లక్షల రెమ్యునరేషన్ వచ్చిందని.. అందులోంచి లక్ష బయటకు తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలను కొనుక్కున్నానని తెలిపాడు. తన వద్ద నుంచి ఏం తీసుకున్నా ఫీల్ కానని.. కానీ పుస్తకాలు అడిగితే ఇవ్వలేనని.. అవే తన ఆస్తి అని తెలిపారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.