Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి వద్దన్నా ఆ సినిమాలో నటించిన పవన్ కల్యాణ్.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్
మెగాస్టార్ చిరంజీవికి సోదరుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్ కల్యాణ్. అనతి కాలంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత గోకుళంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలన్నీ కనీసం 100 రోజులకు పైగా ఆడినవే. అప్పట్లో ఇదొక రికార్డు. అయితే ఖుషి తర్వాత పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు పవన్ ఫ్యాన్స్ కు నచ్చినా సాధారణ జనాలకు పెద్దగా ఎక్కలేదు. అయితే 2008 లో రిలీజైన జల్సా సినిమ పవన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. కానీ మళ్లీ దీని తర్వాత పులి, తీన్ మార్, పంజా రూపంలో పవన్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక 2012లో గబ్బర్ సింగ్, ఆ మరుసటి ఏడాదే అత్తారింటికి దారేది సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు పవన్. ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేశాడు.
అయితే పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గానూ సత్తా చాటాడు.ఆయన దర్శకత్వం వహించిన ఏకైక సినిమా జానీ. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. డైరెక్టర్ గా పవన్ కు మంచి మార్కులు పడినప్పటికీ కమర్షియల్ గా ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ సినిమా గురించి పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘జానీ కథను మొదటగా చిరంజీవికి వినిపించగా, ఆయన స్టోరీ బాగుంది కానీ నేటి జనరేషన్‌కు కనెక్ట్ అవ్వకపోవచ్చు” అని అన్నారట. చివరికి చిరంజీవి చెప్పినట్లే ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. ‘ఆ సమయంలో చిరంజీవి అన్న చెప్పినట్టు జానీ సినిమాలోస కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఆ సినిమా విషయాన్ని తలుచుకుంటే కొంత బాధ అనిపిస్తుంది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వినాయక చవితి స్పెషల్.. రేపు ఓజీ నుంచి క్రేజీ సాంగ్..
You have heard how FIRE sounds. Now feel how love and emotion sing. #SuvviSuvvi will win you over from August 27th, 10:08 AM. ❤️#OG #OGSecondSingle#TheyCallHimOG pic.twitter.com/IXISHMDSYs
— DVV Entertainment (@DVVMovies) August 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








