AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ తల లేని మొండెం ఎవరిది? ఓటీటీలో కిరాక్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడకపోవచ్చు.. కానీ ఓటీటీలో మాత్రం పిచ్చి పిచ్చిగా చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడు కోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

OTT Movie: ఆ తల లేని మొండెం ఎవరిది? ఓటీటీలో కిరాక్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 25, 2025 | 8:44 PM

Share

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఆగస్టు 23, 2024న థియేటర్లలో విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కావడంతో ఓ మోస్తరుగా ఆడింది. ఐఎమ్ డీబీలోనూ 8.6/10 రేటింగ్‌ అందుకుంది. అయితే పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సుమారు ఏడాది తర్వాత గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీ ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ స్టేషన్ సమీపంలో తల లేని శవం కనిపించే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ శవం ఎవరిది ? హంతకుడు ఎవరు ? పోలీస్ స్టేషన్ లో ఎందుకు శవాన్ని వదిలాడు? అనే ప్రశ్నలతో పోలీసులు కేసును దర్యాప్తు ను ముమ్మరం చేస్తారు. కట్ చస్తే.. స్టోరీ మూడు నెలలు వెనక్కు వెళుతుంది.

చైత్ర అనే అమ్మాయి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అమెరికా నుంచి తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. సూర్య అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు. దీనికి సమాంతరంగానే గౌతమ్ అనే యువకుడి కథ కూడా రన్ అవుతుంటుంది. జులాయిగా తిరిగే గౌతమ్ జీవితంలో కొన్ని షాకింగ్ సీక్రెట్స్ ఉంటాయి. ఇవి ఒక హత్యకు దారితీస్తాయి. ఇది తల లేని శవానికి కనెక్ట్ అవుతుంది. మరి ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించారా? ఆ హత్య ఎవరు చేసారు ? ఎందుకు చేశారు ? పోలీసుల దర్యాప్తులో తేలిందేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

ఎవరూ ఊహించని ట్విస్టులు, షాకింగ్ క్లైమాక్స్ తో ఎండ్ అయ్యే సినిమా పేరు బ్రహ్మవరం పీఎస్ పరిధిలో. ఇమ్రాన్ శాస్త్రి తెరకెక్కించిన ఈ తెలుగు మూవీలో మూవీలో గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి బెల్లంకొండ, బలగం రూప లక్ష్మీ, యాంకర్ హర్షిణి, సమ్మెట గాంధీ, జీవా, ప్రేమ్ సాగర్, రుద్ర తిప్పే స్వామి తదితరులు నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే