AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abbas: అబ్బాస్‌ అంటే పడి చచ్చే ఈ పిల్లాడు ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రేమదేశం సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు అబ్బాస్. ముఖ్యంగా అతని హెయిర్ స్టైల్ అయితే కుర్రకారుకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అమ్మాయిల అయితే అబ్బాస్ ను తమ కలల రాకుమారుడిగా భావించారు. అయితే అబ్బాస్ ను అభిమానించే వారిలో ఒక క్రేజీ హీరో కూడా ఉన్నాడు.

Abbas: అబ్బాస్‌ అంటే పడి చచ్చే ఈ పిల్లాడు ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు.. ఎవరో గుర్తు పట్టారా?
Actor Abbas
Basha Shek
|

Updated on: Aug 25, 2025 | 8:04 PM

Share

పై ఫొటోలో ఉన్నవారిలో ఒకరు అబ్బాస్ అని అందరూ ఈజీగా గుర్తుపడుతారు. ప్రేమ దేశం సినిమాతో అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్‌ లో గుర్తింపు తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. దీని తర్వాత కూడా పలు సినిమాల్లో సోలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు అబ్బాస్. అయితే క్రమంగా సినిమా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు. న్యూజిలాండ్ లో తన ఫ్యామిలీతో కలిసి సెటిలైపోయాడు. సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పటికీ చాలా మంది అబ్బాస్ ను అభిమానిస్తారు. అందులో ఒక క్రేజీ హీరో కూడా ఉన్నారు. పైన కనిపిస్తోన్న ఫొటోను చూశారా? ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్న ఓ హీరో తన చిన్న తనంలో అబ్బాస్ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ ఫొటో తీసుకున్నాడు. కొన్నినెలల క్రితం ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా అభిమాన హీరో అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ పిక్ వైరల్ కావడంతో అబ్బాస్ సైతం స్పందించాడు. హీరో పోస్టుకు రిప్లై కూడా ఇచ్చాడు. మరి ఇంతకీ అబ్బాస్ పక్కన ఉన్న ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా?

ఈ కోలీవుడ్ హీరో లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలతో పాటు లవ్, డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. తెలుగమ్మాయి అంజలితోనూ ప్రేమ వ్యవహారం నడిపినట్లు వార్తలు వినిపించాయి. ఈ హీరో మరెవరో కాదు జర్నీ, రాజా రాణి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జై. అయితే ఈ ఫొటో ఎప్పటిది.. ఏ సందర్భంలో తీశారన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ఏదో సినిమా పంక్షన్ లో నే ఈ ఫొటో క్లిక్ మనిపించినట్లు బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

అబ్బాస్ తో జర్నీ మూవీ నటుడు జై..

తెలుగులో ఎక్కువగా కనిపించకపోయినా ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు జై. గతేడాది నయనతారతో కలిసి అన్నపూరణి అనే సినిమాలో కనిపించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలాగే ఈ ఏడాది బేబీ అండ్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కరుప్పర్ నగరంతో పాటు మరో రెండు సినిమాలు ఈ హీరో చేతిలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!