Upendra: స్టార్ హీరో ఉపేంద్ర భార్యని చూశారా? ఆమె కూడా క్రేజీ హీరోయినే.. తెలుగులో ఆ స్టార్ హీరోలతో సినిమాలు
ఓ వైపు సోలో హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. ఇటీవల రజనీకాంత్ కూలీలో ఓ స్పెషల్ రోల్ లో కనిపించాడు ఉప్పీ. స్క్రీన్ పై కనిపించేది కొద్ది సేపే అయినా తన నటనతో అభిమానులతో ఈలలు వేయించాడు

ఓమ్, ఏ, రా, ఉపేంద్ర, హెచ్ 2ఓ, యూఐ.. ఇలా ఎవరికీ అందని వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు తీస్తుంటాడు, నటిస్తుంటాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. తనలో ఎంతో మంచి నటుడు ఉన్నాడో అంతే ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడు. సమాజంలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్లు, సెటైరికల్‌గా, ఎంటర్‌టైనింగ్ గా చూపడంలో ఉపేంద్రది ప్రత్యేక శైలి. అందుకే 56 ఏళ్ల వయసులోనూ ఉప్పీ సినిమాలు రిలీజవుతున్నాయంటే థియేటర్లు ప్రేక్షకులతో కళ కళలాడుతుంటాయి. కేవలం హీరోగానే కాదు.. సన్నాఫ్ సత్యమూర్తీ, గని వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా సినిమాలు చేశాడు. ఇటీవలే కూలీ సినిమాలో స్పెషల్ క్యామియో రోల్ లో కనిపించి మరోసారి తన నటనతో అద్దరగొట్టాడు. 56 ఏళ్ల ఉపేంద్ర తన 25 ఏళ్ల సినిమా కెరీర్ లో సుమారు 60 కు పైగా సినిమాల్లో నటించాడు. పదుల సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అయితే సినిమాల పరంగా తప్పితే ఉపేంద్ర వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.
ఉపేంద్ర భార్య పేరు ప్రియాంక. ఆమె బెంగాలీ నటి. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. వీరి వివాహం 2003లో జరిగింది. ఇప్పుడు వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అన్నట్లు ఉపేంద్ర మాత్రమే కాదు ఆయన సతీమణి కూడా క్రేజీ హీరోయినే. తెలుగులోనూ కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమె పేరు ప్రియాంక త్రివేది. ఇలా పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు.. కానీ జేడీ చక్రవర్తి నటించిన సూరి సినిమా హీరోయిన్ అంటే కళ్ల ముందు ఇట్టే ఓ అందమైన రూపం మెదులుతుంది. ఉపేంద్ర హీరోగా నటించిన రా, హెచ్ 2ఓ సినిమాల్లోనూ ప్రియాంకనే హీరోయిన్ గా నటించింది. ఓవరాల్ గా ఇప్పటివరకు సుమారు 50 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది ప్రియాంక. ఇటీవలే ఉగ్రావతారం అనే సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించిందీ అందాల తార.
వరలక్ష్మీ వ్రతంలో ఉపేంద్ర దంపతులు..
View this post on Instagram
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ప్రియాంక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. మరి ఉపేంద్ర ఫ్యామిలీ ఫొటోలపై ఓ లుక్కేయండి.
ఉపేంద్ర ఫ్యామిలీ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








