AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narappa Movie: మరో మెలోడీతో ఆకట్టుకున్న మణిశర్మ.. నారప్ప నుంచి సెకండ్ సాంగ్..

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు వెంకీ.

Narappa Movie: మరో మెలోడీతో ఆకట్టుకున్న మణిశర్మ.. నారప్ప నుంచి సెకండ్ సాంగ్..
Narappa
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 17, 2021 | 5:19 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు వెంకీ. ప్రస్తుతం వెంకటేష్  నారప్ప సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన నారప్ప పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో వెంకీ ఢిపరెంట్ లుక్‏లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా.. విడుదలకు కరోనా అడ్డంకిగా నిలించింది. దీంతో సినిమాను విడుదలను వాయిదా వేసుకుంది చిత్రయూనిట్. ఇక అప్పటినుంచి ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారా ? లేకా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. చివరకు నారప్ప సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు.

సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద ఓటీటీ రిలీజ్ ఇది. నారప్ప ఈనెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా మణి శర్మ సంగీతం సమకూర్చారు. కార్తీక్ రత్నం- ప్రకాష్ రాజ్- రావు రమేష్- మురళి శర్మ- సంపత్ రాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Adi Saikumar: “అమరన్” ప్రారంభించిన ఆది.. తొలిసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న హీరో..

Ram Gopal Varma: మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవి.. “ఐస్‏క్రీమ్” ఫ్రాంచైజీని తెరకెక్కించనున్న వర్మ ?

Agent Movie: అఖిల్ జోడీగా తమిళ్ బ్యూటీ.. “ఏజెంట్” సినిమా కోసం డైరెక్టర్ భారీ ప్లాన్..