AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గుడ్ న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్‏లో సినిమా చూడొచ్చు.. ఆ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్..

గం గం గణేశా, భజే వాయు వేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సినీ ప్రియులకు థియేటర్స్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదెంటంటే.. మల్టీప్లెక్స్ థియేటర్లలో మూవీ టికెట్ ధరల్ని తగ్గించింది. అయితే ఈ ఛాన్స్ ఒక్కరోజు మాత్రమే. సినిమా లవర్స్ డే సందర్భంగా

Tollywood: గుడ్ న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్‏లో సినిమా చూడొచ్చు.. ఆ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్..
Theatre
Rajitha Chanti
|

Updated on: May 30, 2024 | 7:23 AM

Share

కొన్ని రోజులుగా థియేటర్లలో సందడి తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ కాలేదు. కానీ ఈ వారం మాత్రం వరుసగా మూడు చిత్రాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. గం గం గణేశా, భజే వాయు వేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సినీ ప్రియులకు థియేటర్స్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదెంటంటే.. మల్టీప్లెక్స్ థియేటర్లలో మూవీ టికెట్ ధరల్ని తగ్గించింది. అయితే ఈ ఛాన్స్ ఒక్కరోజు మాత్రమే. సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) వెల్లడించింది.

తక్కువ ధరకే సినీ ప్రియులకు మూవీ అందించడానికి మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లు చేతులు కలిపాయి. ఈ ప్రత్యేక ఆఫర్ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్ ఇండియా, మిరాజ్ సినిమాస్, మూవీ మ్యాక్స్ సహా ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్ లలో అందుబాటులో ఉంటుంది. అంటే రేపు ఒక్కరోజు రూ.99లకే PVR-INOX, సినీపొలిస్, సిటీ ప్రైడ్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధినేత.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందానీ తెలిపారు.

ప్రీమియం సీట్లు మినాహ మిగిలిన 90 శాతం సీట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని అన్నారు. ప్రత్యేకంగా దక్షిణాదిలోని సింగిల్ స్క్రీన్ లో కూడా ఈ సదుపాయం ఉందన్నారు. అలాగే కొన్ని థియేటర్లలో రూ.70 కంటే తక్కువ ధరకే టికెట్స్ కొనుగోలు చేయొచ్చన్నారు. ఈ ఆఫర్ ప్రకటించడం ద్వారా ఎక్కువ మంది సినీ ప్రియులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. గతంలో 2022లో జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించగా.. అప్పట్లో 65 లక్షల మంది సినిమాలను చూశారు. రెండు నెలలుగా ఎన్నికలు జరుగుతుండటంతో కొత్త రిలీజ్ లు లేక థియేటర్లు ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక రేపు ఒక్కరోజే మిస్టర్ అండ్ మిసెస్ మహి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయు వేగం సినిమాలు రిలీజ్ కానున్నాయి.

href=”https://tv9telugu.com/entertainment”>సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముగిసిన ఐపీఎల్ ఆక్షన్.. 10 ఫ్రాంచైజీల పూర్తి స్క్వాడ్‌లు ఇవే
ముగిసిన ఐపీఎల్ ఆక్షన్.. 10 ఫ్రాంచైజీల పూర్తి స్క్వాడ్‌లు ఇవే
షవర్మా నుంచి హరీస్ దాకా.. ఇవి రుచి చూడకుంటే దుబాయ్ పర్యటన వేస్టే
షవర్మా నుంచి హరీస్ దాకా.. ఇవి రుచి చూడకుంటే దుబాయ్ పర్యటన వేస్టే
ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా
ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా
రూ.10 వేలలోపు టాప్‌ 3 బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!
రూ.10 వేలలోపు టాప్‌ 3 బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!
థియేటర్‌కు వెళ్లి మరీ ఆ సినిమా చూసిన టీమిండియా.. వీడియో
థియేటర్‌కు వెళ్లి మరీ ఆ సినిమా చూసిన టీమిండియా.. వీడియో
వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. లగ్జరీ విమానాన్ని తలపించే ఇంటీరియర్‌!
వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. లగ్జరీ విమానాన్ని తలపించే ఇంటీరియర్‌!
శ్రీవారికి ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఎందుకు నిలిపివేస్తారో తెలుసా
శ్రీవారికి ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఎందుకు నిలిపివేస్తారో తెలుసా
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్..!
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్..!
పవన్ గెలుపు కోసం రంగంలోకి రీతు.. ఏం చేసిందో చూశారా? వీడియో
పవన్ గెలుపు కోసం రంగంలోకి రీతు.. ఏం చేసిందో చూశారా? వీడియో
వేలంలో పవర్ హిట్టర్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు
వేలంలో పవర్ హిట్టర్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు