Village Songs: నయా ట్రెండ్.. సినిమాల్లో దుమ్ములేపుతున్న పల్లె పాటలు..

ఈ రోజుల్లో పాటలు ఇన్‌స్టంట్ హిట్ అవ్వడం చాలా కష్టం. అందుకే ఆల్రెడీ హిట్టైన పాటలను తీసుకొచ్చి వాడేసుకుంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్స్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. దీనిపై స్పెషల్ స్టోరీ..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Anil kumar poka

Updated on: May 30, 2024 | 3:02 PM

 ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా..? అవును.. పాతికేళ్ళ కింద పవన్ నోటి నుంచి వచ్చిన ట్యూన్ ఇది. గుర్తు రాలేదా..? ఒక్కసారి తమ్ముడు సినిమాలోని ఏం పిల్లా మాటాడవా గుర్తు తెచ్చుకోండి..? ఇదే ట్యూన్‌ని ఇప్పుడు ఆయ్ సినిమాలో నాయకి ఏమన్నాది అంటూ వాడేసారు రామ్ మిరియాలా.

1 / 5
గతేడాది భోళా శంకర్‌లో మంగ్లీ అండ్ బ్యాచ్ చేసిన ఆడునెమలి పాటను వాడేసారు చిరంజీవి. సినిమాలో ప్రైవేట్ సాంగ్స్ వాడుకోవడం మ్యూజిక్ డైరెక్టర్స్‌కు ట్రెండ్ అయిపోయింది.

2 / 5
ధమాకాలో పల్సర్ బైక్ పాట అలాంటిదే. సినిమాలో పాటలన్నీ ఒకెత్తు అయితే.. చివర్లో వచ్చే ఆ ఒక్క పల్సర్ బైక్ బిట్ నెక్ట్స్ లెవల్ అంతే. ఈ పాటలో రవితేజ, శ్రీలీల ఊపుకు థియేటర్స్ అన్నీ విజిల్స్‌తో మోగిపోయాయి.

3 / 5
 రాజా ది గ్రేట్‌లోనూ గున్నా గున్నా మామిడి అంటూ ఇరక్కొట్టారు మాస్ రాజా. దీనికి యూ ట్యూబ్‌లో 120 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక గతేడాది కోట బొమ్మాళిలోని లింగి లింగి లింగిడి పాట కూడా ప్రైవైట్ సాంగే.

4 / 5
నాని దసరా సినిమాలో చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ బతుకమ్మ పాటను వాడుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. ఈ పాట పిక్చరైజేషన్ అదిరిపోయేలా చేసారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

5 / 5
Follow us