Nithiin: ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ గా నితిన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ పోస్టర్
ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. రంగ్ దే సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. సూపర్ హిట్ గా నిలవలేదు.. దాంతో ఇప్పుడు మరోసారి భీష్మ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.
యంగ్ హీరో నితిన్ కు చాలా అర్జెంట్ గా హిట్ పడాల్సిందే.. నిన్న మొన్న ,వచ్చిన కుర్ర హీరోలు చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకుంటున్నారు. కానీ నితిన్ మాత్రం చాలా వెనక పడ్డాడని చెప్పాలి అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు నితిన్. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. రంగ్ దే సినిమా కాస్త పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. సూపర్ హిట్ గా నిలవలేదు.. దాంతో ఇప్పుడు మరోసారి భీష్మ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు నితిన్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని కూడా తెలిపారు
కానీ ఈ సినిమానుంచి రష్మిక తప్పుకుందని వార్తలు వచ్చాయి. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో రష్మిక ఈ మూవీ నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో..ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.
తాజాగా ఈ మూవీ నుంచి నితిన్ లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో నితిన్ రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram