Nikhil Siddhartha: పిరియాడికల్ డ్రామా పైనే ఆశలు పెట్టుకున్న యంగ్ హీరో నిఖిల్

లేటెస్ట్ గా స్వయంభూ కూడా ఆయన సెంటిమెంట్‌ని స్ట్రెంగ్తన్‌ చేస్తుందా? చూసేద్దాం రండి. స్పై సినిమాను నిఖిలే కాదు, ఆయన్ని అభిమానించే వారు, మార్కెట్‌ వర్గాలు కూడా పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడరు. ట్రెండ్‌లో ఉన్న స్పై కాన్సెప్ట్ తో ఏదో చేద్దామని ప్రయత్నించారు కానీ, ఫలితమే ఆశించినట్టు రాలేదు. అందుకే అంతకు ముందున్న హిట్‌ 18 పేజెస్‌నే నెమరేసుకుంటున్నారు అభిమానులు.

Nikhil Siddhartha: పిరియాడికల్ డ్రామా పైనే ఆశలు పెట్టుకున్న యంగ్ హీరో నిఖిల్
Nikhil Siddharth
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 19, 2023 | 8:11 AM

అటో కాలు, ఇటో కాలు ఎందుకబ్బా? కలిసొచ్చిన రూట్లోనే ట్రావెల్‌ చేస్తే సుఖం కదా అని అనుకుంటున్నట్టున్నారు యంగ్‌ హీరో నిఖిల్‌. ఆయన కెరీర్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఫార్ములా వెనుక పరుగులు తీస్తున్నారు. లేటెస్ట్ గా స్వయంభూ కూడా ఆయన సెంటిమెంట్‌ని స్ట్రెంగ్తన్‌ చేస్తుందా? చూసేద్దాం రండి. స్పై సినిమాను నిఖిలే కాదు, ఆయన్ని అభిమానించే వారు, మార్కెట్‌ వర్గాలు కూడా పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడరు. ట్రెండ్‌లో ఉన్న స్పై కాన్సెప్ట్ తో ఏదో చేద్దామని ప్రయత్నించారు కానీ, ఫలితమే ఆశించినట్టు రాలేదు. అందుకే అంతకు ముందున్న హిట్‌ 18 పేజెస్‌నే నెమరేసుకుంటున్నారు అభిమానులు.

18 పేజెస్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్ లో నిఖిల్‌ని చూసిన వారందరూ ఇంకొక్క హిట్‌ పడితే హ్యాట్రిక్‌ హీరో అనిపించుకుంటాడని చాలా ఆశగా ఎదురుచూశారు. కార్తికేయ2 ఇచ్చిన ఊపు అలాంటిది మరి. ఆ జోష్‌ని 18 పేజెస్‌ కూడా కంటిన్యూ చేసింది. సౌత్‌లో ఆల్రెడీ హిట్‌ అయిన ప్రాజెక్టే అయినా, నార్త్ జనాలకు అనూహ్యంగా కనెక్ట్ అయింది కార్తికేయ2.

 కార్తికేయ2 మాత్రమే కాదు, కార్తికేయ సినిమాకు కూడా తెలుగు జనాల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. అలాంటి జోనర్‌లో నిఖిల్‌ కనిపించడం కొత్త కాబట్టి, ఫ్రెష్‌గా ఫీలయ్యారు ఆడియన్స్.

కార్తికేయ త్రీక్వెల్‌ కోసం కూడా ఈగర్‌గానే వెయిట్‌ చేస్తున్నారు. కార్తికేయ త్రీక్వెల్‌ కన్నా ముందే నిఖిల్‌ స్వయంభూ సినిమాను ప్రారంభించారు.

గుర్రపు స్వారీ చేస్తున్న నిఖిల్‌ ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఆయన్ని కెరీర్‌లో హైట్స్ ఎక్కించిన ఫాంటసీ జోనర్‌లోనే ఉంటుందని చెప్పకుండానే అర్థమవుతోంది. స్పైతో ఒక మెట్టు దిగిన నిఖిల్‌ని, స్వయంభూ మరో మెట్టు పైకెక్కించాలని కోరుకుంటున్నారు సినీ లవర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి