18 Pages : డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న 18 పేజెస్.. జూన్ 1న ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్న చిత్రయూనిట్

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్.  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ఈ స్టోరీ అందిస్తున్నాడు. అలాగే సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్.

18 Pages : డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న 18 పేజెస్.. జూన్ 1న ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్న చిత్రయూనిట్
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2021 | 6:41 AM

 18 Pages : యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ఈ స్టోరీ అందిస్తున్నాడు. అలాగే సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ కు జోడీగా అందాల అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీర్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట. నిఖిల్ కోసం అలంటి పాత్రనే సృష్టించాడట సుకుమార్.

ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. జూన్ 1న నిఖిల్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసేందుకు జీఏ2 సంస్థ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో నిఖిల్ సిగరెట్ తాగుతూ.. కాలిపోతున్న ఓ పేజీని పట్టుకొని ఉన్నాడు. ఆ పేజీపై జూన్ 1న ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ అని రాసి ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ileana D’Cruz: సినిమా ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గోవాబ్యూటీ ఇలియానా.. ఏమన్నదంటే

RRR Update: ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన ….. రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్… కీల‌క అప్‌డేట్ !

Nagarjuna Brahmastra: నాగార్జున సినిమాకోసం ఏకంగా 13 మోషన్‌ పోస్టర్లు, 10టీజర్లు… 2021 చివర్లో..