Movie News: ట్రెండ్ లో మేము సైతం అంటూ ఇద్దరు అక్కాచెల్లెళ్లు… కమింగ్ సూన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లందరూ వరసపెట్టి ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇదొక విచిత్రమైన ట్రెండ్. ఈ ట్రెండ్ లో మేము సైతం...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లందరూ వరసపెట్టి ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇదొక విచిత్రమైన ట్రెండ్. ఈ ట్రెండ్ లో మేము సైతం అంటూ ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా కమింగ్ సూన్ అంటున్నారు. మొన్నటి వరకూ అక్క కోసం వెయిట్ చేసిన తెలుగు ప్రేక్షకజనం… ఇప్పుడు చెల్లెలి మీద ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. ఇంతకీ ఎవరా అక్కచెల్లెళ్లు? తెలుసుకుందాం పదండి. శ్రీదేవి కూతుర్లిద్దరి కెరీర్లో ఇంకా స్ట్రాంగ్ బేస్ పడనే లేదు. లేటెస్ట్ మూవీ రూహీలో ఎంత కష్టపడ్డా జాన్వికి బ్రేక్ అయితే రాలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్ కరణ్ జోహార్ స్పెషల్ కేర్ తీసుకుని దోస్తానా2లో ఛాన్స్ ఇచ్చినా అదొచ్చేదాకా ఆగేలా లేదు పెద్ద కూతురు జాన్వీ. ఆమెను సౌత్ లో ప్రవేశపెట్టడం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు తండ్రి బోనీకపూర్.
చిన్న కూతురు ఖుషీని లైన్లో పెట్టడం కూడా పెద్ద ఛాలెంజ్ గా మారింది బోనీకి. లేటెస్ట్ గా ఖుషీ బాధ్యతను తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజుకు అప్పగించినట్టు తెలుస్తోంది. దిల్ రాజు బేనర్ మీద ప్రస్తుతం నాలుగైదు పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్నాయి. ఒక తెలుగు హీరోకి జోడీగా ఖుషీని ఇంట్రొడ్యూస్ చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. తన దగ్గర కూడా తల్లి పోలికలు చాలా ఉన్నాయంటూ.. సోషల్ మీడియాలో ఫ్రీక్వెన్ట్ గా కొత్త ఫొటోలతో హల్చల్ చేస్తున్నారు ఖుషీ కపూర్. కానీ.. చిన్నమ్మాయి దగ్గర చెప్పుకోదగ్గ హీరోయిన్ మెటల్ లేదన్న కామెంట్లు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అక్క దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న ఖుషీ.. త్వరలో తెలుగు ఆడియెన్స్ కి హాయ్ చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన ….. రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్… కీలక అప్‌డేట్ !