Allu Arjun Pushpa: పుష్ప సినిమాను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్న సుకుమార్.. అక్కడి వారికి కూడా కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న డైరెక్టర్..

అల్లు అర్జున్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ లతో, స్టైల్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

Allu Arjun Pushpa: పుష్ప సినిమాను పర్ఫెక్ట్ గా ప్లాన్  చేస్తున్న సుకుమార్.. అక్కడి వారికి కూడా కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్న డైరెక్టర్..
Introducing Pushpa Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2021 | 7:13 AM

అల్లు అర్జున్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ లతో, స్టైల్ తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా సినిమాకు బన్నీ బన్నించుప్పించే వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయ్యాడు బన్నీ. బన్నీకి కేవలం తెలుగులోనే కాదు ఇతరభాషల్లోను అభిమానులు భారీగానే ఉన్నారు. మలయాళం లో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలు అక్కడ మలయాళంలోకి డబ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ లారీడ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకోసం మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నాడట సుకుమార్. బన్నీకి జోడీగా లక్కీబ్యూటీ రష్మిక మందన నటిస్తుంది.

ఇదే సమయంలో సెకండ్ పార్ట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప రెండవ పార్ట్ టైటిల్ మొదలుకుని ఐటెం హీరోయిన్ వరకు బాలీవుడ్ తో కనెక్షన్ ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటున్నారు. పుష్ప సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ దేవీ కాంబినేషన్ లో పాటలు ఎలాఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది.ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండనుందట. ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ ను దేవిశ్రీ ప్రసాద్ వినిపించగానే సుకుమార్ ఫుల్ ఖుషీ అయ్యాడట. జానపద బాణీలో సాగే ఈ పాటను రీసెంట్ గా రికార్డు చేశారని అంటున్నారు. ఐటమ్ సాంగులో ఆడిపాడే బ్యూటీగా ఊర్వశీ రౌతేలా .. దిశా పటాని పేర్లు వినిపించాయి. మరి వీరిలో బన్నీతో కలిసి చిందులు వేసే ముద్దుగుమ్మ ఎవరో చూడాలి. మొదటి పార్ట్ లో ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ కనిపించబోతుండగా రెండవ పార్ట్ లో మాత్రం మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మాఫియా నేపథ్యం అంటే ఖచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

18 Pages : డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న 18 పేజెస్.. జూన్ 1న ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్న చిత్రయూనిట్

Ileana D’Cruz: సినిమా ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గోవాబ్యూటీ ఇలియానా.. ఏమన్నదంటే

RRR Update: ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలైన ….. రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అగ్రిమెంట్… కీల‌క అప్‌డేట్ !