Rashmika Mandanna: ప్రభాస్ కు జోడీగా అల్లు అర్జున్ హీరోయిన్ అంటున్నారే … ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త..
ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. తన మనస్సులోని మాటలన్నీ చెప్పుకొస్తుంది. లాక్ డౌన్ లో ఖాళీగా ఉండలేకో.. లేక గుండెలో దాచుకోవడం ఇష్టం లేకో...
ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. తన మనస్సులోని మాటలన్నీ చెప్పుకొస్తుంది. లాక్ డౌన్ లో ఖాళీగా ఉండలేకో.. లేక గుండెలో దాచుకోవడం ఇష్టం లేకో.. తన కోరికల చిట్టాను విప్పేస్తుంది. మొన్నటికి మొన్న తమిళలంటే ఇష్టమని.. మూడు ముళ్లూ, ఏడడుగులూ నడిచేది అక్కడే అని చెప్పిన రష్మికా మండన్నా.. ఈ సారి ఓ పాన్ ఇండియా స్టార్ తో డేటింగ్ చేస్తా అని ఓపెన్ అయ్యింది. నిజానికి లాక్ డౌన్ అనేది రాకపోతే.. రష్మిక హ్యాపీగా షూటింగులతో బిజీగా గడిపింది. తెలుగుతో పాటు.. బాలీవుడ్ లోనూ ఆమె మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా కారణంగా అవన్నీ నిలిచిపోయాయి. దీంతో ఖాళీగా ఉంటున్న రష్మిక.. ఈ మధ్య తన మనస్సులోని మాటలను బయటపెడుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటున్న ఈ బ్యూటీ.. ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేని.. తన మనస్సులో ఉన్న విషయాలను బయటపెడుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తనకు తమిళులన్నా.. తమిళ సంప్రదాయం అన్నా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఏనాటికైనా తాను అడుగుపెట్టబోయే అత్తారిల్లు.. అరవ సంప్రదాయం పాటిస్తున్నవారిదే అని తేల్చిచెప్పింది.
ఇక అంతటితో ఆగకుండా.. ఈ సారి తనకు నచ్చేవాడి క్వాలిటీస్ ఏంటో చెప్పుకొచ్చిందీ.. కన్నడ బ్యూటీ. ఈసారి మరో ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు.. బోల్డ్ కామెంట్ చేసింది. ఒకవేళ డేట్ కు వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్తారని అడగిని ప్రశ్నకు కాస్త కూడా తడుముకోకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పేసింది. తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని తేల్చిచెప్పింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ అంటూ తనలోని అభిమానాన్ని పంచుకుంది. వాస్తవానికి రష్మికకు పర్ ఫెక్ట్ పేయిర్ విజయ్ దేవరకొండనే. వీరిద్దరూ స్క్రీన్ పై చేసిన మ్యాజిక్.. ఎవరూ మర్చిపోలేరు. అందుకే వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని.. డేటింగ్ లో ఉన్నారని ఎన్నో రూమర్స్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై ఈ హీరోహీరోయిన్లు ఇప్పటివరకు నోరు విప్పలేదు కూడా. అయితే రష్మిక మాత్రం తన మనస్సులో ప్రభాస్ ఉన్నాడని చెప్పడం.. హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు రష్మిక నోటా ప్రభాస్ మాట రావడంతో త్వరలో ఈ అమ్మడికి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ తో జత కట్టిన ఈ బ్యూటీ త్వరలో ప్రభాస్ సరసన నటిస్తుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :