AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో అతను కూడా అంతే లవ్ చేస్తాడు.. ఆ నటుడిపై నిహారిక ప్రశంసలు

'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇప్పుడు ఆ సక్సెస్ ను కొనసాగించేందుకు 'రాకాస' అనే మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు.

Niharika Konidela: మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో అతను కూడా అంతే లవ్ చేస్తాడు.. ఆ నటుడిపై నిహారిక ప్రశంసలు
Niharika Konidela
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 8:15 PM

Share

ఢీ జోడీలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఆకట్టుకుంది. పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు నిర్మాతగానూ విజయాలు అందుకుంటోంది. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇదే విజయోత్సాహంలో ‘రాకాస’ అనే మరో సినిమాతో ఆడియెన్స్ ను పలకరించనుంది మెగా డాటర్. మానస శర్మ తెరకెక్కించిన ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ లో సంగీత్ శోభన్‌, నయన్ సారిక హీరో, హీరోయిన్లుగా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 03)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది నిహారిక. అలాగే వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.

రాకాస సినిమాలో జబర్దస్త్ నటుడు గెటప్ శ్రీను కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక గెటప్ శ్రీను గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నా జీవితంలో నేను కలిసిన బెస్ట్ పర్సన్ గెటప్ శ్రీను. బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఒక చెల్లెల్ని ఎంతగా చూసుకుంటారో, అంత ప్రేమ ఆయన చూపిస్తారు. మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో, ఆయన కూడా అంతే కేర్ తీసుకుంటారు. షూటింగ్ సమయంలో కన్నా ప్రమోషన్స్ సమయంలో గెటప్ శ్రీనుతో మరింత దగ్గరయ్యాను. ఏదైనా టెన్షన్ ఉన్నా ముందుగా రిలాక్స్ అవ్వమని, టీ తాగమని చెప్పే వ్యక్తి ఆయన ‘ అంటూ జబర్దస్త్ నటుడిపై ప్రశంసలు కురిపించింది నిహారిక. ఇదే సందర్భంగా రాకాస తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ‘బరి’లో గెటప్ శ్రీను నటిస్తాడని వెల్లడించింది నిహారిక. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

రాకాస సినిమా ప్రమోషన్లలో నిహారిక, గెటప్ శ్రీను.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో అతను కూడా అంతే లవ్ చేస్తాడు
మా ఇంట్లో వాళ్లు ఎంత ప్రేమిస్తారో అతను కూడా అంతే లవ్ చేస్తాడు
మహిళలు రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..?
మహిళలు రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా..?
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బూస్ట్.. జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బూస్ట్.. జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
సమ్మర్ హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
సమ్మర్ హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగులోనూ..
ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగులోనూ..
: తిరుపతి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో బస్సు..
: తిరుపతి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో బస్సు..
KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదే?
KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదే?
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !