AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్

ఈయనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి. అందుకే నాటకాలు, స్టేజ్ షోల్లో నటించారు. మంచి రంగ స్థలం నటునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.కెరీర్ ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియోలో కొన్ని రోజులు పని చేసిన ఆయన ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

Tollywood: 400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 6:41 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ లెజెండ్ అని చెప్పవచ్చు. కమెడియన్‌గా, మాటల రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. తన ప్రతిభకు గుర్తింపుగా నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఈ టాలీవుడ్ నటుడిది తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని నేదనూరు. తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడా. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా కూడా ఇచ్చాడట. ఈ నటుడు పెద్దన్నయ్య కూడా వేద పండితుడే. ఈయన మాత్రం చాల డిఫరెంట్ గా నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. డ్రామాలు, నాటకాల్లో నటించి రంగ స్థలం నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ఆల్ ఇండియో రేడియోలో పనిచేశారు. అయితే నటనపై ఆసక్తిని చంపుకోలేక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటునిగా అంచెలంచెలుగా ఎదిగారు. సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆడియెన్స్ తో కన్నీళ్లు కూడా పెట్టించగలరీ నటుడు. ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలిగే ప్రతిభ ఈయన సొంతం. అందుకే నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు.మరి ఆయనెవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి అదే నండి ఎల్. బి. శ్రీరామ్. ఆయన పక్కన ఉన్నది భార్య. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ సందర్భంలో ఆయనే ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో హలో బ్రదర్ (1994), హిట్లర్ (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు ఎల్బీ శ్రీరామ్. ఆ తరువాత ఇ.వి.వి. సినిమా చాలా బాగుంది సినిమాలో పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. ఒక అమ్మో ఒకటో తారీఖు సినిమాలో తన నటనతో అందరినీ ఏడిపించారీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఇవి కూడా చదవండి
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

LB Sriram (@lb_sriram) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

తన సినిమా కెరీర్ లో మొత్తం సుమారు 400 కు సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా యూబ్యూబ్ ఛానెల్ ద్వారా పలు ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తున్నారు.

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

LB Sriram (@lb_sriram) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
మనుషుల కంటే రెట్టింపు వేగంతో నిర్ణయాలు తీసుకోగలవి కాకులు!
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
కత్తెర మొద్దుబారిందా? ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!
కత్తెర మొద్దుబారిందా? ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!