KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో మరో కీ ప్లేయర్ ఎంట్రీ..
KKR vs SRH Playing XI: కోల్‌కతా, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు 30 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో కోల్‌కతా 19 మ్యాచ్‌లు గెలవగా, హైదరాబాద్ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అవ్వగా, దానిని కోల్‌కతా సూపర్ ఓవర్‌లో గెలుచుకుంది.

IPL Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నేడు తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆరో మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ రహానే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఎస్ఆర్‌హెచ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ అరంగేట్రం చేస్తున్నాడు.
రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో ఓటమి చవిచూశాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో, చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానె(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
