AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాపారాలకు ఊరట.. జన్ విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

చిన్నపాటి తప్పిదాలకు జైలు శిక్షల బదులు జరిమానాలు విధించేలా ‘జన్ విశ్వాస్ బిల్లు–2026’ను పార్లమెంట్ ఆమోదించింది. 80 కేంద్ర చట్టాలకు సవరణలు చేస్తూ వ్యాపారాలకు ఊరట కల్పించే ఈ బిల్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు కీలకంగా మారనుంది. .. ..

వ్యాపారాలకు ఊరట.. జన్ విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
Rajya Sabha
Ram Naramaneni
|

Updated on: Apr 02, 2026 | 7:39 PM

Share

దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం, చిన్న తప్పిదాలపై క్రిమినల్ కేసుల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా రూపొందించిన ‘జన్ విశ్వాస్ (సవరణల) బిల్లు–2026’కు పార్లమెంట్ గురువారం పూర్తి స్థాయిలో ఆమోదం లభించింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ కూడా వాయిస్ ఓటుతో ఆమోదించింది. చర్చకు సమాధానంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ మార్పులు సాధారణ ప్రజలు, సూక్ష్మ-చిన్న మధ్యతరహా పరిశ్రమలకు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ బిల్లు పరిధి విశాలంగా ఉండడం విశేషం. మొత్తం 80 కేంద్ర చట్టాలకు సవరణలు చేస్తూ, 79 చట్టాల్లోని 784 నిబంధనలను పునర్‌వ్యవస్థీకరిస్తోంది. 23 మంత్రిత్వ శాఖలకు చెందిన చట్టాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిలో ముఖ్యంగా 717 నిబంధనల్లో చిన్న ఉల్లంఘనలకు క్రిమినల్ శిక్షలను తొలగించి, 67 నిబంధనల ద్వారా ‘సులభ జీవనం’కు అనుకూల మార్పులు చేయనున్నారు. ఈ బిల్లులో ప్రధాన మార్పు జైలు శిక్షల స్థానంలో సివిల్ జరిమానాలను ప్రవేశపెట్టడమే. ఉదాహరణకు, ఔషధాలు-కాస్మెటిక్స్ చట్టం కింద ఉన్న కొన్ని ఉల్లంఘనలకు ఇప్పటివరకు జైలు శిక్ష ఉండగా, ఇకపై భారీ జరిమానాతో సరిపెడతారు. అలాగే జాతీయ రహదారుల చట్టం కింద రహదారిని ప్రమాదకరంగా మార్చిన వారికి ఉన్న జైలు శిక్షను తొలగించి, రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు జరిమానా విధించేలా మార్పులు చేశారు.

కొన్ని చట్టాల్లో పూర్తిగా జైలు శిక్షలను తొలగించారు. ఇండియన్ సక్సెషన్ చట్టం, విద్యుత్ చట్టం వంటి వాటిలో చిన్నపాటి నేరాలకు ఇకపై జైలుశిక్ష ఉండదు. అంతేకాదు, కొన్ని నేరాలను పూర్తిగా రద్దు చేశారు. తప్పుడు ఫైర్ అలారం ఇవ్వడం, పుట్టిన-చనిపోయిన వివరాలు నమోదు చేయకపోవడం, కాపీరైట్ రిజిస్టర్‌లో తప్పులు నమోదు చేయడం వంటి అంశాలను నేరాల జాబితా నుంచి తొలగించారు. జరిమానా వ్యవస్థను కూడా సవరించారు. ప్రతి మూడు సంవత్సరాలకు కనీస జరిమానాను 10 శాతం పెంచే విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. అదే సమయంలో మొదటిసారి చేసిన తప్పులకు హెచ్చరికలు, రెండోసారి చేసినప్పుడు సూచనలు, ఆ తర్వాతే జరిమానాలు విధించే విధంగా ‘గ్రేడెడ్ కంప్లయెన్స్’ విధానాన్ని ప్రవేశపెట్టారు.

చట్ట అమలులో పారదర్శకత కోసం విచారణాధికారులు, అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ చట్టంలో ఆస్తి పన్ను వ్యవస్థలో మార్పులు, విలువ నిర్ణయ కమిటీ ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు వంటి చర్యలు కూడా ఈ బిల్లులో భాగమయ్యాయి. మొత్తం మీద చిన్నపాటి తప్పిదాలకు జైలు భయం తొలగించి, వ్యాపారాలకు సౌలభ్యం కల్పించే దిశగా ఈ ‘జన్ విశ్వాస్’ బిల్లు కీలక అడుగుగా భావిస్తున్నారు.

Follow Us
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బూస్ట్.. జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బూస్ట్.. జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
సమ్మర్ హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
సమ్మర్ హాలిడేస్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగులోనూ..
ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగులోనూ..
తిరుపతి జిల్లాలో బస్సు ప్రమాదం..
తిరుపతి జిల్లాలో బస్సు ప్రమాదం..
KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదే?
KKR vs SRH Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11 ఇదే?
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..