వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే రూ. 200 క్యాష్‌బ్యాక్.. అస్సలు మిస్సవకండి..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. మీరు ఈ నెల సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే ఆగండి. గ్యాస్ బుక్ చేసే వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది పేటీఎం.. కేవలం ఒక్క చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు.. మీ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా రూ. 200 క్యాష్‌బ్యాక్ మీ సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం గుడ్ న్యూస్ తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా మండుతున్న తరుణంలో ఎల్‌పీజీ బుకింగ్‌పై ఏకంగా రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ లేదా ఇండేన్ .. ఇలా ఏ కంపెనీ సిలిండర్ వాడుతున్నా, పేటీఎం ద్వారా బుక్ చేస్తే ఈ లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య గ్యాస్ ధరలు రూ.200 మేర పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు ఈ ఆఫర్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.
క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలి?
- మీ మొబైల్‌లో Paytm యాప్‌ను ఓపెన్ చేయండి.
- Recharge and Bill Payments విభాగంలో Book Gas Cylinder ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకుని, కస్టమర్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయండి.
- పేమెంట్ చేసే ముందు Offers For You సెక్షన్‌లోకి వెళ్లండి.
- అక్కడ CYLWIN అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయండి.
గుర్తుంచుకోవాల్సిన నిబంధనలు
ఈ ఆఫర్ కింద ప్రతి 2,000వ వినియోగదారుడు రూ. 200 క్యాష్‌బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. క్యాష్‌బ్యాక్ నేరుగా మీ ఖాతాలోకి రావాలంటే, మీ బ్యాంక్ అకౌంట్ పేటీఎంకు లింక్ అయి ఉండాలి. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. అలాగే ఒక్క యూజర్‌కు ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. కాగా గ్యాస్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో, బుకింగ్ చేసే ముందే యాప్‌లోని నిబంధనలను, మీకు వర్తించే క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి.
