AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది

గత ఏడాదిగా ఈ పాట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్, యూట్యూబ్‌ ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్ వీడియోలే కనిపించేవి. ఈ పాట రిలీజ్‌ చేసినప్పటినుంచి చాలామందికి ఇది ఫేవరెట్‌ అయిపోయింది. ఇప్పుడీ ట్రెండింగ్ సాంగ్ తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది.

Trending Song: ఏం సాంగ్ రా బాబూ! ఏడాదిగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌.. ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది
Dheema Telugu Song
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 7:24 PM

Share

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తుండడం విశేషం. సినిమా ప్రమోషన్లలో భాగంగా గతేడాది ఈ సినిమా నుంచి ఒక మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ధీమా’ పేరుతో రూపొందిన ఈ సాంగ్ కు డైరెక్టర్‌ విఘ్నేశ్‌యే లిరిక్స్‌ అందించాడం విశేషం. ఇక అనిరుధ్ ఎప్పటిలాగే తన అద్భుతమైన గాత్రంతో ఈ పాటను మరింత అందంగా మలిచాడు. ధీమా పాట రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సాంగ్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ పాట రిలీజైనప్పటి నుంచి చాలా మందికి ఇది ఫేవరెట్ సాంగ్ గా మారిపోయింది. తాజాగా ధీమా పాట తెలుగు వెర్షన్ ను కూడా తీసుకొచ్చారు మేకర్స్. హృదయపు కోటే.. దోచేశావే.. ఇకపై నువ్వే నాకు మహారాణివే.. అంటూ సాగే ఈ పాట ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పాటను విన్న మ్యూజిక్ లవర్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. లేటుగానైనా సరే తెలుగులో ధీమా సాంగ్ రిలీజ్‌ చేసినందుకు థ్యాంక్స్‌ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విషయానికి వస్తే.. విఘ్నేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయన తార నిర్మిస్తోంది. ఇందులో హీరో, హీరోయిన్లతో పాటు ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్‌, మాళవిక, సీమాన్, మిస్కిన్, ఆనంద్ రాజ్, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

అనిరుధ్ మళ్లీ అదరగొట్టాడు

ధీమా తెలుగు సాంగ్ లిరికల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us