Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను దయ్యాన్ని కాదురా బాబు.. నమ్మండి..! క్లారిటీ ఇచ్చిన అందాల భామ

తన దాంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వయ్యారి భామ ఆమె.. చేసింది తక్కువ సినిమాలే కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఫుల్ గా ఉంది. కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క బిగ్ హిట్ అందుకుంది. కానీ ఆఫర్స్ మాత్రం క్యూ కడుతున్నాయి. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది ఈ చిన్నది.

నేను దయ్యాన్ని కాదురా బాబు.. నమ్మండి..! క్లారిటీ ఇచ్చిన అందాల భామ
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 10, 2025 | 6:38 PM

హీరో, హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో రూమార్స్ రావడం చాలా కామన్. ఒక పెద్ద సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ గురించి కూడా సోషల్ మీడియాలో ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతుంది. దాంతో ఆమె ఆ రూమర్స్ కు చెక్ పెట్టింది. ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..  ఆమె చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో సొంతం చేసుకుంది. అంతే కాదు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆమె అంతగా హిట్స్ అందుకోలేకపోయింది. కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క బిగ్ హిట్ అందుకుంది. కానీ భారీ ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే

ఆమె ఓ క్రేజీ బ్యూటీ, తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు. ఆతర్వాత మిస్టర్ మజ్ను సినిమా చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ రెండు సినిమాలతో రానుంది.

ఇవి కూడా చదవండి

నా వల్ల అందరికి లాభం వచ్చింది.. నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు: హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది నిధి అగర్వాల్. అలాగే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్ గా చేస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. అలాగే ఈ మూవీ హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది. కాగా నిధి అగర్వాల్ దెయ్యం పాత్రలో యాక్ట్ చేస్తుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీని పై నిధి స్పందించింది. “రాజా సాబ్ సినిమాలో నేను దెయ్యం పాత్రలో నటించడం లేదు. ఈ విషయం ముందుగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంద . అయితే నా పాత్ర ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అని తెలిపింది. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. సెట్‌లో ప్రభాస్ ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటారు. అందరితో చాలా సరదాగా ఉంటారు అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.

ఇదెక్కడి సినిమా రా మావ.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. అలాగే అంతకు మించి..

నిధి అగర్వాల్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..