- Telugu News Photo Gallery Cinema photos Senior heroine Rambha favorite dancer is now a pan India star heroine
హీరోయిన్ రంభ మెచ్చిన డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఎవరంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ రోజుల్లో ఈ నటి తన నటనతో టాలీవుడ్‌నే షేక్ చేసింది, తన అందంతో మతిపొగొట్టి, అందరి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ బ్యూటీ నటిగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పలు డ్యాన్స్ షోలకు జడ్జీగా కూడా చేసింది.
Updated on: Mar 10, 2025 | 7:07 PM

సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ ముందు డ్యాన్స్ చేసిన ఓ చిన్నది ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆరోజుల్లో ఆ బ్యూటీ డ్యాన్స్ అంటే రంభకు చాలా ఇష్టం ఉండేదంట. అంతలా ఆ అమ్మడు తన డ్యాన్స్‌తో రంభ మనసునే దోచేసింది.

సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ ముందు డ్యాన్స్ చేసిన ఓ చిన్నది ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆరోజుల్లో ఆ బ్యూటీ డ్యాన్స్ అంటే రంభకు చాలా ఇష్టం ఉండేదంట. అంతలా ఆ అమ్మడు తన డ్యాన్స్‌తో రంభ మనసునే దోచేసింది.

ఫిదా మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న ఈ అమ్మడు తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తుంది.

తాజాగా ఈ చిన్నది అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో రణ్‌భీర్ కపూర్ సరసన రామయణం మూవీలో సీత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

తండేల్ మూవీ సక్సెస్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రంభ ఫేవరెట్ డ్యాన్సర్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఆ రోజు రంభముందు డ్యాన్స్ చేసి మెప్పించి, నేడు బాలీవుడ్‌లో తన నటనతో అదరగొట్టడానికి రెడీ అవుతున్న సాయిపల్లవి అంటూ అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.





























