Chiranjeevi: మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో హిట్టు కొట్టిన చిరు.. ఆతర్వాత భోళా శంకర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరంజీవి చివరిగా నటించిన భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహారమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే బింబిసార సినిమాతో వశిష్ఠ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని తెలుస్తుంది. అలాగే ఓ అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు ప్రేమకావాలి సినిమాతో పరిచయమైన ఇషా చావ్లా. ఆదిసాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమకావాలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ ఇషా చావ్లా. తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైంది. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.