AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhaava OTT: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి ఛావా..

ఇప్పుడు ఎక్కడ చూసిన ఛావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఇప్పటికే విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేశారు.

Chhaava OTT: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి ఛావా..
Chaavaa
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2025 | 4:50 PM

Share

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఛావా సినిమా ఒకటి. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విక్కీ కౌశల్ , రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగాను అదరగొట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లో రూ. 500కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ మూవీ.  మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. తొలి షోతోనే చావా సినిమా ఆ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

చరిత్రలో చాల మందికి తెలియని ఓ గొప్ప మహారాజ్ శంభాజీ గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తో పాటు.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. చావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజన్ నిర్మించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు. బాలీవుడ్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. మార్చి 7న ఛావా సినిమా తెలుగులోనూ విడుదలైంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఛావా సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరింత హైప్ రావడంతో పాటు క్రేజ్ తగ్గక పోవడంతో ఓటీటీ రిలీజ్ లెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?