ఛావా సినిమాను ఎగతాళి చేసిన చిల్లరగాళ్ళు.. పిచ్చి కొట్టుడు కొట్టిన ఆడియన్స్
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఛావా. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. తొలి షోతోనే చావా సినిమా ఆ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఎక్కడ చూసిన ఛావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఇప్పటికే విడుదలై ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేశారు. మార్చి 7న ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఇక తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీని మ్యాడ్ డాక్ బ్యానర్ మీద లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించాడు. దినేష్ విజన్ నిర్మించాడు. హిందీలో ఈ సినిమా ఇప్పటికే రూ. 500కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.
అలాగే తెలుగులోనూ కలెక్షన్స్ బాగానే రాబట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చింది. రెండు రోజుల్లోనే మొత్తంగా ఈ ఛావా తెలుగు వర్షెన్‌కు 6.81కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఛావా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో కొంతమంది చిల్లరగాళ్ళు ఎగతాళి చేశారు. దాంతో ఆడియన్స్ బుద్ది చెప్పారు.
ఛావా సినిమా క్లైమాక్స్ సీన్స్ సినిమాకే హైలైట్. ఆ సీన్స్ లో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. ఆ సీన్స్ లో ఎమోషనల్ అవ్వని ప్రేక్షకులు ఉండరు. అయితే కొంతమంది ఆకతాయిలు క్లైమాక్స్ సమయంలో జోకులు వేస్తూ ఐదుగురు ఆకతాయిలు నవ్వుకున్నారు. కుళ్లు జోకులు వేస్తూ పిచ్చి చేష్టలు చేశారు. దాంతో పక్కనే ఉన్న ఫ్యాన్స్ మండిపడ్డారు. దాంతో ఆ ఆకతాయిలను పిచికొట్టుడు కొట్టి.. బయటకు తీసుకు వెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టారు. క్షమాపణలు చెప్పించి, ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి జై, శంభాజీ మహారాజ్‌కి జై అనిపించారు.
View this post on Instagram




