నా వల్ల అందరికి లాభం వచ్చింది.. నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు: హీరోయిన్
కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర భాష నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లో చిన్న ఛాన్స్ వచ్చినా నటించేందుకు సిద్ధమంటున్నారు పలువురు హీరోయిన్స్. కానీ అంతకు మించి భారీగా పారితోషికం సైతం వసూలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్స్ కూడా హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ సినిమా భారీ హిట్ అయినా తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. సినిమా వల్ల అందరూ లాభపడ్డారు కానీ తనకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు అని ఆరోపించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో ఈ అమ్మడి మంచి క్రేజ్ ఉంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఆమె టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్, బాలీవుడ్ లోనూ ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. స్టేజ్ పై ఆమె డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఆ బ్యూటీ మన రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆడిపాడింది. ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా ఫతేహి. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. బాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ లో మెప్పించిన నోరా.. తెలుగులో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలో సాంగ్ చేసింది. అలాగే ప్రభాస్ సరసన బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది నోరా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, బీ టౌన్ లో వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో జరిగిన చేదు అనుభవాలు పంచుకుంది. స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించినప్పటికీ తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. అలాగే తనకే తాను చేసిన స్పెషల్ సాంగ్స్ వల్ల సినిమాలు విజయంలోనూ కీలక పాత్ర పోషించాయని తెలిపింది. “నేను చేసిన స్పెషల్ సాంగ్స్ వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా భారీ హిట్ అయ్యాయి. సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. కానీ నిర్మాతలు నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. నేను స్టేజ్ పర్ఫామెన్స్ ఇవ్వడం వల్లే నాకు డబ్బులు వచ్చాయి. దాని మీద నేను ఎలాంటి పోరాటం చేయలేదు. అలాగని డబ్బు లేకుండా కేవలం పేరు మాత్రమే సొంతం చేసుకుంటే ఏం లాభం. ఇక పై ఎలాంటి లాభం లేకుండా పని చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని తెలిపింది.
View this post on Instagram




