బ్యాడ్ లక్ అంటే ఈ అమ్మడిదే.. ఆవారా సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
కార్తీ సినిమాలకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. కార్తీ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నారు. ఇక కార్తీ సూపర్ హిట్ సినిమాల్లో ఆవారా సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా.

కార్తీ విషయానికి వస్తే.. 2007లో ‘పరుతివీరన్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత యుగానికి ఒక్కడు, శకుని, చెలియా, దొంగ, ఊపిరి, సర్దార్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. యుగానికొక్కడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కి అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆవారా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమిళ్ లో పయ్యా అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ఆవారా పేరుతో రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాలో కార్తీ తో పాటు తమన్నా కూడా తన నటనతో ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో తమన్నా తన అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ముందుకు తమన్నా కంటే ముందు మరో హీరోయిన్ ను అనుకున్నారట. ఆమె ఎవరో కాదు నయనతార. ఇటీవలే దర్శకుడు లింగుస్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముందుగా ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా అనుకున్నాం.
ముందుగా నయనతారను అనుకున్నట్టు.. అనివార్య కారణాల వల్ల చివరిలో ఆమె స్థానంలో చివరకు తమన్నాను తీసుకున్నానని వెల్లడించారు. నయన్ కు కథ కూడా చెప్పినప్పుడు ఆమె కథ బాగా నచ్చి ఒకే కూడా చెప్పిందట. అయితే చిత్రీకరణకు ముందు అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలిపారు. కాగా తమన్నా ఆవారా సినిమా చేసే సమయంలో ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే.. అలాగే ఆమె తన నటనతో ఆకట్టుకుంది అని లింగు స్వామి తెలిపారు.
View this post on Instagram




