- Telugu News Photo Gallery Cinema photos Actress Ashika Ranganath Stunning Photos In Saree Goes Viral
Tollywood: రెండు సినిమాలు చేస్తే ఒకటే హిట్టు.. ఈ అందానికి కలిసిరాని అదృష్టం.. ఫోటోస్ చూస్తే..
తెలుగులో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటాలనుకుంది. కన్నడ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న ఈ అమ్మడుకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సరైన క్రేజ్ రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ సైతం తగ్గిపోయాయి. తెలుగులో రెండు సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే.
Updated on: Mar 09, 2025 | 1:56 PM

కన్నడలో ఆమె టాప్ హీరోయిన్. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. మొదట్లో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీలలో రన్నరప్ గా నిలిచింది. ఇంతకీ ఈ వయ్యారిని గుర్తుపట్టారా.. ?

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఆషికా రంగనాథ్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. క్రేజీ బాయ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆషికా.. ఆ తర్వాత రాంబో 2 సినిమాతో తొలి హిట్ ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత కన్నడలో మదగజ, అవతార పురుష, గరుడ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అలాగే పలు స్టార్ హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ తో అలరించింది.

ఇక తమిళంలోకి తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి.. కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఆషికాకు అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ హిట్టయ్యింది. అలాగే ఆషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ తెలుగులో ఆఫర్స్ మాత్రం రావడంలేదు.




