Tollywood: ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాల లిస్టు ఇదే.. ఓ లుక్కేయండి.!
OTT & Theatre Cinemas: కరోనా సెకండ్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు థియేటర్లలో, ఇంకొన్ని చిత్రాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. ఫ్లాట్‌ఫార్మ్ ఏదైనా...
కరోనా సెకండ్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు థియేటర్లలో, ఇంకొన్ని చిత్రాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. ఫ్లాట్‌ఫార్మ్ ఏదైనా కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీస్‌కు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. మరి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాల లిస్టు ఏంటో చూసేద్దాం పదండి.!
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు:
గల్లీ రౌడీ: సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా సెప్టెంబరు 17న థియేటర్‌ల్లో విడుదల కానుంది.
విజయ్ రాఘవన్: బిచ్చగాడు ‘ఫేం’ విజయ్ ఆంటోని, ఆత్మిక జంటగా నటించిన చిత్రం ‘విజయ్ రాఘవన్’. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది.
ఫ్రెండ్‌షిప్: క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్‌షిప్’. జాన్‌పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీటితో పాటు ‘జెమ్’, ‘ప్లాన్ బి’, ‘హనీట్రాప్’ అనే చిత్రాలు కూడా సెప్టెంబర్ 17వ తేదీన థియేటర్ల ద్వారా విడుదల కానున్నాయి.
ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్, సిరీస్‌లు ఇవే..
‘మ్యాస్ట్రో’గా నితిన్:
నితిన్, నభా నటేశ్ ప్రధాన పాత్రల్లో మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యాస్ట్రో’. ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
‘అనబెల్.. సేతుపతి’..
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘అనబెల్.. సేతుపతి’ ఈ నెల 17న డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి దీపక్ సుందర్‌రాజన్ దర్శకుడు కాగా.. తాప్సీ పన్ను హీరోయిన్‌గా నటించింది.
ఓటీటీలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’..
సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబరు 17 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
ఇంకొన్ని ఓటీటీ రిలీజ్‌లు ఇలా ఉన్నాయి…
అమెజాన్ ప్రైమ్ వీడియో
- డోర్ ఏ అండ్ మీ -సెప్టెంబరు 17
- వీడ్స్ – సెప్టెంబరు 15
- సెర్చింగ్ -సెప్టెంబరు 14
- ఆజ్ ఎబౌ సో బిలో -సెప్టెంబరు 16
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- అన్ హియర్డ్- సెప్టెంబరు 17
- కన్ఫెషన్స్ ఆఫ్ ఎ షోఫాహోలిక్- సెప్టెంబరు 17
నెట్‌ఫ్లిక్స్
- అన్‌కహీ కహానియా- సెప్టెంబరు 17
- నైట్ బుక్స్ -సెప్టెంబరు 15
జీ5
- సర్వైవర్- సెప్టెంబరు 12(రియాల్టీ షో)
- బుక్ మై షో – ది సూసైడ్ స్క్వాడ్ -సెప్టెంబరు 16
సోనీ లైవ్
ప్రియురాలు – సెప్టెంబరు 17
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్