Ram Charan: ప్రభాస్ బౌలింగ్.. రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్.. వీడియో అదిరిపోయింది..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ కాగా.. శ్రీరామనవమి సందర్భంగా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు.

ఉప్పెన సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ వీడియోకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో చరణ్ ఊర మాస్ అవతారం.. స్వాగ్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక వీడియోకు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ గ్లింప్స్ చివర్లో చరణ్ క్రికెట్ షాట్ మరింత హైలెట్ అయ్యింది. ఈ క్లిప్ నెట్టింట షేర్ చేస్తూ పెద్ది రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు ఈ గ్లింప్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
అయితే గ్లింప్స్ చివర్లో బ్యాటింగ్ ఆడే రామ్ చరణ్ క్రీజ్ వదిలి ఫ్రంట్ పుట్ వచ్చి హ్యాండిల్ ను నేలకు కొట్టి మళ్లీ లేచి బంతిని బలంగా కొడతారు. ఈ సీన్ గ్లింప్స్ మొత్తానికే హైలెట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సీన్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ షాట్ వీడియోకు రకరకాలుగా క్రియేట్ వీడియోస్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ చేసిన క్రియేటివ్ వీడియో అదిరిపోయింది.
Just for fun 🚶 pic.twitter.com/OmeUd4Khiu
— 𝗕𝗮𝗱𝗯𝗼𝘆𝘆⚡ (@harshayash_) April 6, 2025
ఇవి కూడా చదవండి :