Nani: చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్‌లో నేచురల్ స్టార్.. నాని సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవలే టాక్ జగదీష్ గా వచ్చాడు నాని. ఓటీటీ వేదికగా విడుదల ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.

Nani: చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్‌లో నేచురల్ స్టార్.. నాని సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్..
Nani
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2021 | 7:19 AM

Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇటీవలే టాక్ జగదీష్ గా వచ్చాడు నాని. ఓటీటీ వేదికగా విడుదల ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాకు టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు నాని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతోపాటు అలానే నాని ‘అంటే.. సుందరానికి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా నాని మరో సినిమాను ఓకే చేశారు. నాని కెరీర్ లో 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా పండుగను పురస్కరించుకుని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గ నటిస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి నేను లోకల్ సినిమాలో నటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు నాని. ఈ సినిమాకు దసరా అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. Nani

మరిన్ని ఇక్కడ చదవండి :  Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్.. Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో) Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”